calender_icon.png 6 February, 2026 | 2:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గ్రూప్--1 పరీక్షలన్నీ సక్రమమే!

06-02-2026 01:01:21 AM

  1. అవకతవకలు జరిగినట్టు ఆధారాల్లేవ్
  2. సీజేతో కూడిన ద్విసభ్య ధర్మాసనం వెల్లడి
  3. నియామకాలపై హైకోర్టు బెంచ్ కీలక తీర్పు
  4. సింగిల్ జడ్జి బెంచ్ తీర్పు కొట్టివేత
  5.   563 మంది అభ్యర్థులకు మార్గం సుగమం

హైదరాబాద్, ఫిబ్రవరి 5 : తెలంగాణ ప్రభుత్వం, టీజీపీఎస్సీ రాష్ట్ర హైకోర్టులో భారీ ఊరట లభించింది. గ్రూప్--1 మెయి న్స్ పరీక్ష విషయంలో ర్యాంకులు రద్దు చేస్తూ గతంలో సింగిల్ జడ్జి బెంచ్ తీర్పును హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని డివిజన్ బెంచ్ గురువారం కొట్టే సిం ది. ‘గ్రూప్--1 పరీక్ష పారదర్శకంగానే జరిగింది. పరీక్షలో అవకతవకలు జరిగినట్లు ఆధారాల్లేవు.

గ్రూప్--1 నియామకాలు సక్రమమే’ అని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేష్‌కుమార్ సింగ్, జస్టిస్ జీఎం మొహియుద్దీన్‌తో కూడిన ద్విసభ్య ధర్మాసనం తీర్పునిచ్చింది. మొత్తం 563 మంది అభ్యర్థులు ఇప్పటికే నియామక ఉత్తర్వులు అం దుకున్న సంగతి తెలిసిందే. తాజా తీర్పుతో ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు ఊరట లభించింది. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ 2024 అక్టోబర్ 21 నుంచి 27 వరకు గ్రూప్-1 మెయిన్స్ పరీక్ష నిర్వహించింది.

అయితే, పత్రాల మూల్యాంకనంలో అవకతవకలు చోటుచేసుకున్నాయని, దీనిపై న్యా య విచారణ జరిపించాలని కోరుతూ సిద్దిపేట శివనగర్‌కు చెందిన కే పరుశరాములు తోపాటు మరికొందరు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై విచారణ చేప ట్టిన హైకోర్టు సింగిల్ జడ్జి, మార్చి 10న వెలువరించిన తుది మార్కుల జాబితా, మార్చి 30న ప్రకటించిన జనరల్ ర్యాంకిం గ్ జాబితాను రద్దు చేశారు.

అలాగే.. గ్రూ ప్-1 మెయిన్స్ అన్ని సమాధాన పత్రాలను తిరిగి మూల్యాంకనం చేసి ఫలితాలను ప్రకటించాలని టీజీపీఎస్సీని ఆదేశించారు. ఇది సాధ్యంకాని పక్షంలో మెయిన్స్ రద్దుచేసి మళ్లీ నిర్వహించాలని సింగిల్ జడ్జి బెంచ్ తేల్చిచెప్పింది. అయితే, ఈ ఆదేశాలను సవాల్ చేస్తూ టీజీపీఎస్సీతో పాటు గ్రూప్--1కు ఎంపికైన అభ్యర్థులు మళ్లీ డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించారు. దీంతో సీజే నేతృత్వంలోని ధ్విససభ్య ధర్మాసనం ఈ పిటిష న్లంటినీ కలిపి విచారణ జరిపింది.

టీజీపీఎస్సీ తరఫున అడ్వొకేట్ జనరల్ ఏ సుదర్శ న్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. నిబంధనల ప్రకారం పారదర్శకంగా పరీక్షలు జరిగాయన్నారు. మూల్యాంకనంలో అవకతవకలు జరగకూడదన్న లక్ష్యంతో ఇద్దరి చేత మూ ల్యాంకనం చేయించారని తెలిపారు. పరీక్ష కేంద్రాల పెంపు, పరిపాలనాపరమైన సౌల భ్యం కోసం ప్రిలిమ్స్, మెయిన్స్‌కు హాల్‌టికెట్లను వేర్వేరుగా జారీచేసిందని చెప్పారు.

పరీక్షల్లో కాపీయింగ్ జరిగిందని ఎలాంటి ఆరోపణలు లేవని వెల్లడించారు. అర్హత సా ధించిన అభ్యర్థుల తరఫున సీనియర్ న్యా యవాది డీ ప్రకాష్‌రెడ్డి వాదనలు వినిపి స్తూ, పరీక్షల్లో అర్హత సాధించలేని వారు కో ర్టును ఆశ్రయించారన్నారు. రెండు హాల్‌టికెట్లు ఉంటాయని పరీక్షలకు ముందే వెల్ల డించినా అప్పుడు అభ్యంతరం చెప్పకుండా, ఫలితాలు విడుదలయ్యాక పిటిషన్ వేయ డం చెల్లదన్నారు.