calender_icon.png 13 November, 2025 | 1:10 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దేశ ఐక్యతకు పటేల్ కృషి అభినందనీయం

13-11-2025 12:14:33 AM

ఆదిలాబాద్, నవంబర్ 12 (విజయక్రాంతి):  దేశ ఐక్యత కోసం సర్దార్ వల్లభాయ్ పటేల్ చేసిన కృషి అభినందనీయమన ఎంపీ గోడం నగేష్, ఎమ్మెల్యే పాయల్ శంకర్‌లు పేర్కొన్నారు. మై భారత్ ఆధ్వర్యంలో పటేల్ 150వ జయంతి సందర్భంగా బుధవారం ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో ముందుగా పటేల్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం యూనిటీ మార్చ్‌ను ఎంపీ, ఎమ్మెల్యేలు జండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్యామలాదేవి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు బ్రహ్మానంద్, జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి శ్రీనివాస్, నాయకులు, విద్యార్థులు  పాల్గొన్నారు.