13-11-2025 12:15:26 AM
చారకొండ, నవంబర్ 12 : మండలంలోని సారంబండ తండా- దొంతులగుట్ట తండా వరకు చేపట్టిన బీటీ రోడ్డు పనులు పూర్తిగా నాసిరకంగా చేపడుతున్నారని తండావాసులు వాపోయారు.మంగళవారం సారంబండ తండా నుంచి దొంతులగుట్ట తండా ఒక కిలోమీటర్ రూ. 80 లక్షల వ్యయంతో రోడ్డు పనులు ప్రారంభించారు. రోడ్డు కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో పూర్తిగా నాసిరకంగా చేపట్టారు.
రోడ్డు పనులు నాణ్యతగా చేపట్టాలని తండావాసులు డిమాండ్ చేస్తున్నారు. సంబంధిత అధికారులకు చెప్పిన ఏమాత్రం పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నత అధికారులు స్పందించి బీటి రోడ్డు పనులు నాణ్యతగా చేపట్టాలని డిమాండ్ చేస్తు న్నారు. లేనిపక్షంలో జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తామని తండావాసులు హెచ్చరించారు.