12 March, 2026 | 6:49 AM

ఇసుక వ్యాపారుల గెట్టు పంచాయితీ!

12-03-2026 12:06 AM
  1. అక్రమ ఇసుక వ్యాపారం అడ్డుకట్టకు అధికారుల అడుగులు

ప్రాంతాల పేరుతో చిచ్చు పెడుతూ ఇసుక వ్యాపారుల మోకాలడ్డు

పట్టింపులేని మైనింగ్...ప్రేక్షక పాత్రలో పోలీస్ శాఖలు

నిర్మాణ రంగాన్ని మరోసారి కుదిపేస్తున్న ఇసుక వ్యవహారం

నాగర్ కర్నూల్ మార్చి 11 (విజయక్రాంతి)పేద బడుగు బలహీన వర్గాలు నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇంటి నిర్మాణాలు, ప్రభుత్వ రోడ్లు భవనాలు, ఇతర నిర్మాణ రంగాన్ని ఇసుక వ్యవహారం మరోసారి కుదిపేస్తోంది. నాగర్ కర్నూల్ జిల్లా ప్రాంతాన్ని చుట్టుముట్టేసిన దుందుభి వాగు నుండి ఇసుక వ్యా పారులు అక్రమంగా వాగుల్లోకి చొరబడి రాత్రి పగలు అని తేడా లేకుండా భారీ వా హనాల సహాయంతో ఇసుకను దోచేస్తున్న ట్లు ప్రభుత్వం గుర్తించింది.

గత ప్రభుత్వ హ యాంలో ఇసుక వ్యాపారులకు, రాజకీయ నేతలకు కల్పతరువుగా ఉన్న దుందుభి వా గును కొల్లగొట్టి కోటాను కోట్లు పోగేసుకున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యం లో సామాన్యులు ఇల్లు కట్టుకోవాలంటే ఇ సుక బంగారం కంటే అధిక ధరకు పలుకుతుండడంతో ఇంటి నిర్మాణం అతి కష్టంగా మారిన పరిస్థితి. దీంతో రాష్ట్ర ప్రభుత్వం మ న ఇసుక వాహనం ప్రభుత్వ పరంగా సామాన్యులకు సైతం తక్కువ ధరకు ఇసుక అం దించేలా ఈ పథకాన్ని ముందుకు తీసుకొచ్చింది.

రెవెన్యూ, గ్రామపంచాయతీ, ఇరిగే షన్, భూగర్భ జిల్లా శాఖ, సంయుక్తంగా దుందుభి పరివాహక ప్రాంతాల్లో ఇసుక రీచులను గుర్తించి పోలీస్, మైనింగ్ శాఖ స హకారంతో ఈ పథకాన్ని పూర్తిస్థాయిలో అమలు జరిగేలా అధికారులు చొరవ చూ పారు. కానీ ఇసుక వ్యాపారం పైనే ఆధారపడి దోచుకుంటున్న కద్దర్ చొక్కా లీడర్లు ఇసుక వ్యాపారులు స్థానిక ప్రజలను రెచ్చగొడుతూ తమ ప్రాంతంలో భూగర్భ జలా లు అడుగంటుతాయని మన ఇసుక వాహనానికి అడ్డుపుల్ల వేస్తున్నారని చర్చ జరుగు తోంది. స్థానిక నేతల చుట్టూరా ఉండే ద్వితీయ శ్రేణి నాయకులే ఇసుక వ్యాపారంలోకి చొరబడ్డారని ఆరోపణలు ఉన్నాయి.

త మ గ్రామం గుండా రవాణా జరిగితే రోడ్లన్నీ ధ్వంసం అవుతున్నాయని కుంటి సాకులు చె బుతూ స్థానిక ప్రజల చేత  ప్రత్యేక ఉద్యమానికి కుట్రలకు తెగబడ్డారు. తెలకపల్లి మం డలం నడిగడ్డ, రామగిరి వంటి ప్రాంతాల్లో ఇసుక వ్యాపారులు మన ఇసుక వాహనం అమల్లోకి రాకుండా అనేక కుట్రలకు తెగబడుతున్నట్లు స్థానికంగా చర్చ జరుగుతుంది. తాజాగా నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ మన ఇసుక వాహనం పకడ్బందీగా అమలు జరగాలని అన్ని శాఖల అధికారులు సమన్వ యంతో నిరుపేదలకు సైతం ఇసుక అందుబాటులోకి రావాలని ఆదేశాలు ఇచ్చారు.

ఇక్కడే అసలు తలనొప్పి మొదటికి వచ్చిందని మన ఇసుక వాహనం పోర్టల్ లో దర ఖాస్తు చేసుకున్న వాహనదారులను ఆ ప్రాం త వాహనదారులు రానివ్వకుండా అడ్డుపడుతుండడంతో కొత్త పంచాయతీ తెరమీ దకు వచ్చింది. నాగర్ కర్నూల్ ప్రాంతాల్లో ఉండే ఇసుక వ్యాపారులు సైతం తమ ప్రాం తంలో ఇతర ప్రాంతాల వారు ఇసుక రవాణా ఎలా చేస్తారో చూస్తామంటూ బుధవారం పలు వాహనాలను అడ్డుకొని తిప్పి పంపడంతో ఈ పంచాయతీ మరింత ము దురుతున్న పరిస్థితి.

ఏకంగా జిల్లా కలెక్టర్ మన ఇసుక వాహనాన్ని పకడ్బందీగా అమ లు పరచాలని ఇచ్చిన ఆదేశాలను సైతం ఆయా శాఖ అధికారులు పెడచెవిన పెడు తూ ఇసుక వ్యాపారులు గొడవ పడుతున్న అంశంలో తలదూర్చలేమంటూ తప్పించుకోవడం వెనుక అలసత్వమా లేదా అవినీతికి పాల్పడ్డారా అన్న అనుమానాలు వ్యక్తం అ వుతున్నాయి. మన ఇసుక వాహనం అమ లు జరగకుండా అక్రమ ఇసుక వ్యాపారం కొనసాగేలా కిందిస్థాయి అధికారులు వ్యూహం రచిస్తున్నట్లు అనుమానాలు బలపడుతున్నాయి.

అందుకు ఆయా మండల రెవెన్యూ పోలీస్ యంత్రాంగం కూడా అక్ర మ ఇసుక వ్యాపారానికే మొగ్గు చూపుతున్నారా అన్న అనుమానాలు వ్యక్తమవు తున్నాయి. ప్రాంతాల పేరుతో గొడవ క్రియేట్ చేస్తూ మన ఇసుక వాహనానికి మంగళం పాడేలా కుట్రలకు పాల్పడుతున్నారని చర్చ జరుగుతుంది.