19 March, 2026 | 1:03 PM

Breaking News

మైదాన ప్రాంతాల్లో భారీ వర్షాలు.. ఎత్తైన ప్రాంతాల్లో మంచు   •   ఢిల్లీలోని వాణిజ్య, పన్నుల భవనంలో అగ్నిప్రమాదం   •   ఇలా అయితే పండుగ ఎలా..?   •   దేశంలో ఉండాలంటే.. వందేమాతరం ఆలపించాల్సిందే.. ఒవైసీ కళాశాలల్లో ఉగ్రమూలాలు   •   బీఆర్ఎస్ పార్టీకి షాకిచ్చిన సర్పంచులు   •   కరాచీలో వర్షం బీభత్సం: 19 మంది మృతి.. ఎమర్జెన్సీ ప్రకటించిన మేయర్   •   తెలంగాణ ప్రజలకు కేసీఆర్ ఉగాది శుభాకాంక్షలు   •   ‘తెలంగాణ ప్రజా జాగృతి’ పేరుతో కవిత కొత్త పార్టీ   •   శ్రీరామనవమి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలకు సీఎం రేవంత్ రెడ్డికి ఆహ్వానం   •   రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు సీఎం, డిప్యూటీ సీఎం ఉగాది శుభాకాంక్ష‌లు   •  

గోల్ కీపర్‌గా పాఠక్

29-08-2024 12:59 AM

చాంపియన్స్ ట్రోఫీకి హాకీ జట్టు ప్రకటన

న్యూఢిల్లీ: ఒలింపిక్స్‌లో కాంస్యంతో సత్తా చాటిన భారత హాకీ జట్టు మరో కీలక పోరుకు సమాయత్తమవుతోంది. సెప్టెంబర్‌లో చైనా వేదికగా ఆసియా చాంపియన్స్ ట్రోఫీ జరగనుంది. ఈ నేపథ్యంలో బుధవారం హాకీ ఇండియా హర్మన్‌ప్రీత్ సారథ్యంలోని 18 మందితో కూడిన భారత జట్టును ఎంపిక చేసింది. ఇటీవలే గోల్ కీపర్ పీఆర్ శ్రీజేశ్ వీడ్కోలు పలకడంతో అతని స్థానంలో కిషన్ బహదూర్ పాఠక్‌ను ఎంపిక చేసింది. కిషన్‌కు ప్రత్యామ్నాయంగా సూరజ్ కర్కేరా ఉండనున్నాడు. ఒలింపిక్స్‌లో ఆడిన 10 మందిని ఈ టోర్నీకి ఎంపిక చేశారు.

రెగ్యులర్ వైస్ కెప్టెన్ హార్దిక్ సింగ్‌కు విశ్రాంతి నివ్వడంతో మిడ్ ఫీల్డర్ వివేక్ సాగర్ డిప్యూటీగా వ్యవహరించనున్నాడు. హార్దిక్ సింగ్‌తో పాటు కీలక ప్లేయర్లు మన్‌దీప్ సింగ్, లలిత్ ఉపాధ్యాయ్, షంషేర్ సింగ్, గుర్జంత్ సింగ్‌లకు కూడా టోర్నీ నుంచి విశ్రాంతి కల్పించింది.  కాగా ఈ టోర్నీలో భారత్ డిఫెండింగ్ చాంపియన్ హోదాలో బరిలోకి దిగనుంది. వచ్చే నెల 8 నుంచి 17 వరకు జరగనున్న టోర్నీలో భారత్‌తో పాటు కొరియా, మలేషియా, పాకిస్థాన్, చైనా, జపాన్‌లు బరిలోకి దిగనున్నాయి. సెప్టెంబర్ 8న భారత్ తమ తొలి మ్యాచ్‌ను చైనాతో ఆడనుంది. ఆ తర్వాత వరుసగా జపాన్, మలేషియా, కొరియా, పాకిస్థాన్‌లతో ఆడనుంది.