3 August, 2026 | 9:08 PM

బౌరంపేట్ లో వీధి దీపాల కొరత

03-08-2026 08:33 PM

ఎస్సీ కమ్యూనిటీ హాల్ ముందు వీధి దీపాలు దేవుడెరుగు

ఫిర్యాదులు చేసిన స్పందించని అధికారులు

ఆవేదన వ్యక్తం చేస్తున్న ప్రజలు

కుత్బుల్లాపూర్,(విజయక్రాంతి): భౌరంపేట్ లోని వీధి దీపాలు లేక ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.రాత్రి అయ్యిందంటే చాలు అడుగు బయట పెట్టాలంటే బెంబేలెత్తుతున్నారు. భౌరంపేట్ గ్రామంలోని ఎస్సీ సంఘం కమ్యూనిటీ హాల్ ముందు సంవత్సరం నుండి వీధి దీపాలు లేకపోవడంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. అసలే వర్షాకాలం రాత్రిళ్ళు విషపూరిత సర్పాలు తిరుగుతున్నాయని ప్రజలు చెబుతున్నారు.

వీధి దీపాలు లేకపోవడం, చీకటిగా ఉండడంతో ఇంటి నుండి అడుగు బయట పెట్టాలంటేనే భయపడుతున్నారు.సంబంధిత అధికారులకు వీధి దీపాలు లేవని ఎన్ని సార్లు ఫిర్యాదులు చేసిన పట్టించుకోవడం లేదని వాపోయారు.ఆదివారం రాత్రి ఒక విషపూరితమైన పాము బయటకు వచ్చి స్థానికులను భయాందోళనకు గురించేసింది. ప్రజల ప్రాణాలు పోతే కానీ అధికారులు స్పందించరా అని ప్రజలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఫిర్యాదులు చేసిన స్పందించని అధికారులు: పీసరి కృష్ణారెడ్డి

కమ్యూనిటీ హాల్ ముందు దీపాలు లేవని సంబంధిత అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసిన స్పందించడం లేదని పీసరి కృష్ణారెడ్డి మండిపడ్డారు. భౌరంపేట్ లో తమ పక్క వీధిలో నెల రోజుల నుండి 24 గంటలు నాలుగు వీధి దీపాలు వెలుగుతున్నాయని, కానీ ఇక్కడ దీపాలు లేక ప్రజలు ఇబ్బందులు పడుతుంటే అధికారులకు కనపడడం లేదా అని ప్రశ్నించారు. సంవత్సరం నుండి వీధి దీపాలు రావడం లేదని ఎన్నోసార్లు ఫిర్యాదు చేసిన స్పందన కరువైంది.ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి వెంటనే వీధి దీపాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.