27 July, 2026 | 6:03 PM

Breaking News

అర్హులందరికీ ఓటు హక్కు కల్పించాలి: ఎమ్మెల్యే కోరం కనకయ్య   •   భాగీరథిపల్లిలో రూ.25 లక్షల కల్వర్టు నిర్మాణానికి భూమిపూజ   •   ఇల్లందు ఏరియాలో సింగరేణి ఉద్యోగులకు క్వార్టర్ల కౌన్సిలింగ్ నిర్వహణ   •   నేరేడుచర్లలో భాజపా ఆధ్వర్యంలో " సర్" ప్రక్రియపై సమీక్ష   •   రైతులు ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాలి   •   ఎక్స్‌టార్షన్‌కు పాల్పడిన నిందితులు అరెస్ట్.. రిమాండ్   •   తొలిముద్ద కార్యక్రమాన్ని ప్రారంభించిన కార్పొరేటర్ కంచర్ల హిమశ్రీ   •   ప్రభుత్వ, ఆశ్రమ పాఠశాలల్లో సౌకర్యాలు కల్పించాలి   •   వేపల మాధవరం గ్రామానికి మై హోమ్ చేయూత   •   కొత్తపల్లి రైతు వేదికలో విత్తన మేళా   •  

బంజారాహిల్స్‌లో.. పటోలా ఆరట్స్ వస్త్ర ప్రదర్శన

15-09-2025 12:57 AM
  1. రోడ్డు నంబర్1లో ఏర్పాటు
  2. ప్రారంభించిన సినీ నిర్మాత నిర్మాత పాయల్ సరాఫ్ 

హైదరాబాద్ , సెప్టెంబర్ 14(విజయక్రాంతి)ః  నగరంలోని బంజారా హిల్స్ రోడ్ నంబర్ 1లో గల  లేబుల్స్ పాప్-అప్ స్పేస్ లో ఏర్పాటైన  డి సన్స్ పటోలా ఆరట్స్ వస్త్ర  ప్రదర్శనను టాలీవుడ్ సినీ నిర్మాత, నగర సోషలైట్ పాయల్ సరాఫ్ ఆదివారం పారంభించారు. ‘విభిన్నమైన పటోలా ఆర్ట్ చీరలు, పటోలా హ్యాండ్లూమ్, సిల్క్ వస్త్రో త్పత్తులను ఒకే వేదికలో ప్రదర్శించడం అభినందనీయమని  అన్నారు.

నేరుగా వీవర్ నుంచి విని యోగదారునికి అందించేందుకు ఏర్పాటైన ఈ ప్రదర్శన ప్రతి ఒక్కరు ప్రోత్సహించాలని  పాయల్ సరాఫ్   కోరారు.డి సన్స్ పటోలా ఆరట్స్  నిర్వాహకులు భవిన్ మాట్లాడుతూ  ఈ నెల 18వ తేదీ వరకు  కొనసాగుతున్న ప్రదర్శనలో ప్రత్యేక కలెక్షన్స్ వేదికగా  పట్టన్ పటోలా, బంధనీ, బనారసీ, జరీ కోటా, కాశ్మీరి, మహేశ్వరీ, కంచిపురం, మోడల్ అహింసా సిల్క్, లక్నోవీ, అజ్రక్ చీరలు, సూట్లు, కుర్తీలు, డ్రస్ మెటీరియల్, బెడ్షీట్లు, ఆభరణాలు వంటి ఎన్నో విభిన్నమైన  ప్రత్యేక కలెక్షన్లు అందుబాటులో ఉంచామని వివరించారు.   నేత కార్మికులను ప్రోత్సహించడంతో  పాటు చేనేత పరిశ్రమకు మార్కె ట్ను అందించడమే ఈ ఎగ్జిబిషన్  ప్రధాన సామాజిక లక్ష్యం అని ఆయన తెలిపారు.