15-09-2025 12:55:57 AM
ముషీరాబాద్, సెప్టెంబర్ 14(విజయక్రాంతి): గురువు లేనిది ప్రపంచం దేశం నడవదని, గురువులే భావితరాలను తీర్చిదిద్దే బాధ్యత వారిపై ఉందని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు అన్నారు. ఈ మేరకు ఆదివారం బాగ్లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో శిల్పా ఆర్ట్ క్రియేష న్స్, కల్చరల్ వెల్ఫేర్, కాపర్తి క్యాన్సర్ ఫౌండేషన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గురుపూజోత్సవం, నేషనల్ శిల్ప ఐకాన్ అవార్డ్స్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు, తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్, ఎమ్మెల్సీ బి. దయానంద్ ముఖ్య అతిథులుగా పాల్గొని గత 15 సంవత్సరాల నుండి ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగుతూ సేవ లు అందిస్తున్న పలువురు ఉపాధ్యాయులను శాలువాలు, పూలమాలలతో సత్కరిం చి మెమొంటోలను అందజేశారు.
ఈ సందర్భంగా బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచం దర్ రావు మాట్లాడుతూ భారతదేశంలో తప్ప, ప్రపంచంలో ఎక్కడ కూడా గురువుల మీద ప్రత్యేక గౌరవం గురుశిష్యుల అనుబంధం, భావన లేదని, కేవలం భారతదేశం లోనే ఉందని ఆయన అన్నారు. తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు మాట్లాడుతూ రాష్ట్రపతి ముర్ముకు గురవే కావాలి అదే గురువైన గురువు కూడా గురువే కావాలన్నారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న గురు వులందరికి గురుపూజోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాపర్తి క్యాన్సర్ ఫౌండేషన్ ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షుడు కాపర్తి ప్రకాష్, బీజేపీ నాయకులు ఉప్పల శారద, కార్యక్రమం కార్యదర్శులు సౌమ్య శ్రీకాంత్, ఆర్ పద్మప్రియ పాల్గొన్నారు.