calender_icon.png 11 November, 2025 | 8:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యార్థులకు ఇచ్చిన ఎన్నికల హామీలు అమలు ఇంకెప్పుడు?

11-11-2025 12:00:00 AM

  1. ప్రభుత్వ విద్యాసంస్థల్లో విద్యార్థులకు సౌకర్యాలు కల్పించాలి
  2. విద్యను వ్యాపారం చేస్తున్న ప్రైవేట్ విద్యాసంస్థల్ని సీజ్ చేయాలి
  3. విద్యాశాఖకు ప్రత్యేక మంత్రిని కేటాయించాలి
  4. ఏఐఎస్‌ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కసిరెడ్డి మణికంఠ రెడ్డి

రాజన్న సిరిసిల్ల, నవంబర్ 10(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వ చ్చి 23 నెలలు కావస్తున్న విద్యార్థులకు ఇచ్చి న హామీలను ఒక్కటి కూడా అమలు చేయలేదని, ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, సంక్షేమ హాస్టళ్లు సమస్యలకు నిలయంగా మారాయని అందులో చదువుతున్న విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని,నేడు సీ ఎం రేవంత్ రెడ్డి వద్ద విద్యాశాఖ ఉన్న అపాయింట్ లు ఇవ్వక సమస్యలు పరిష్కారం కావడం లేదని రాష్ట్రంలో విద్యాశాఖకు ప్రత్యేక మంత్రినీ నియమిస్తానే సమస్యలు పరిష్కా రం అవుతాయని, విద్యను వ్యాపారంగా మా రుస్తూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ నిబంధనలు పాటించని ప్రైవేట్ విద్యాసంస్థలను సీజ్ చేయాలని ఏఐఎస్‌ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కసిరెడ్డి మణికంఠ రెడ్డి డిమాండ్ చేశారు.

రా జన్న సిరిసిల్ల జిల్లా ఏఐఎస్‌ఎఫ్ జిల్లా ఆఫీస్ బేరర్స్ సమావేశం జిల్లా అధ్యక్షుడు కుర్ర రాకేష్ అధ్యక్షతన జరిగింది.ఈ సందర్భంగా మణికంఠ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థుల స మస్యలు పరిష్కరించడంలో పాలకులు విఫలమవుతున్నారని. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో విద్యార్థులకు అనేక హామీలు ఇచ్చిందని విద్యార్థినులకు ఎలక్ట్రిక్ స్కూటీ లు, లాప్టాప్ లు, ప్రతి విద్యార్థి ఇంటింటికి ఉచిత వైఫై, ఐదు లక్షల విద్య భరోసా కార్డు అనేక హామీలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ

అధికారంలోకి వచ్చి 23 నెలలైనా ఒక్క హామీ అమలు చేయలేదని విద్యార్థులకు ఇస్తామన్న ఫీజు రీయంబర్స్మెంట్ బకాయిలు, స్కా లర్షిప్లు ఇవ్వకుండా విద్యార్థులను వేధిస్తుందని, ప్రభుత్వ పాఠశాలలో కళాశాలలో సంక్షే మ హాస్టల్ సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నాయని హాస్టల్ విద్యార్థులందరికీ చలికా లం దృష్ట్యా ఇబ్బందులు కాకుండా చర్యలు తీసుకోవాలని, ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజనాన్ని ప్రవేశపెట్టాలని, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మౌలిక సదుపాయాలు కల్పించాలని, ఖాళీగా ఉన్న టీచింగ్ నాన్ టీచింగ్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని, సీఎం రేవంత్ రెడ్డి వద్ద విద్యాశాఖ ఉన్న విద్యార్థుల సమస్యలు పరిష్కారం కావడం లేదని సీఎంకు విద్యారంగ సమస్యలపై కలిసి విన్నవించే పరిస్థితి లేదని విద్యాశాఖ ప్రత్యేక మంత్రి కేటాయించడం ద్వారానే సమస్యలు పరిష్కారం అవుతాయని, రాష్ట్రంలో నిబంధనలు,నాణ్యత ప్ర మాణాలు పాటించకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్న ప్రవేట్ విద్యాసంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలని మణికంఠ డిమాండ్ చేశారు.ఈ సమావేశంలో ఏఐఎస్‌ఎఫ్ జిల్లా కార్యదర్శి మంద అనిల్, జిల్లా ఉపాధ్యక్షుడు ఆదిత్య,తదితరులున్నారు.