చంద్రబాబుకు హ్యాట్సాఫ్.. 15 ఏళ్లపాటు కలిసే అధికారంలో ఉంటాం
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. సంకీర్ణ ప్రభుత్వం సవాళ్లతో కూడుకున్నదని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్(Andhra Pradesh Deputy CM Pawan Kalyan) తెలిపారు. ఎన్ని సమస్యలున్నా ప్రజల కోసం కలిసే ఉంటామని చెప్పారు. మేం కలిసి లేకుంటే ప్రజలకు ద్రోహం చేసినట్లేనని పవన్ కళ్యాన్ పేర్కొన్నారు. మమ్మల్ని అగౌరవపరిచేలా మాట్లాడినా.. కలిసే ఉంటామన్నారు. 15 ఏళ్లపాటు కలిసే అధికారంలో ఉంటామని డిప్యూటీ సీఎం పవన్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో ప్రతిపక్షం అనేది లేదు.. ప్రజలు ఆ అవకాశం ఇవ్వలేదన్నారు. కంఠంలో ప్రాణం ఉన్నంతవరకు రాష్ట్రాభివృద్ధికి కట్టుబడి ఉన్నామని తెలిపారు.
పవన్ కల్యాణ్ నోట మరోసారి క్షమాపణలు
అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా పవన్ కల్యాణ్ నోట మరోసారి క్షమాపణలు అనే మాట వచ్చింది. వైసీపీ ఆందోళనపై గవర్నర్(AP Governor Syed Abdul Nazeer)కు పవన్ క్షమాపణలు చెప్పారు. వైసీపీ తీరు చూస్తే పాలసీ టెర్రరిజం గుర్తుకువస్తోందన్నారు. గవర్నర్ ప్రసంగాన్ని వైసీపీ బాయ్‌కాట్ చేయడం దురదృష్టకరమన్న పవన్ కళ్యాణ్ వైసీపీని ఐదేళ్లు తట్టుకుని నిలబడిన చంద్రబాబుకు పవన్ కల్యాణ్ హ్యాట్సాఫ్ చెప్పారు. అటు అసెంబ్లీలో సీఎం చంద్రబాబు నాయుడు(CM Chandrababu Naidu) మాట్లాడుతూ.. ఏపీ ఆర్థిక వ్యవస్థను నిర్వీర్యం చేశారని మండిపడ్డారు. డబుల్ ఇంజన్ సర్కార్‌తోనే అభివృద్ధి సాధ్యమని వివరించారు స్వార్థ ప్రయోజనాల కోసం కలిసి పోటీ చేయలేదని స్పష్టం చేసిన చంద్రబాబు రాష్ట్ర అభివృద్ధే తమ లక్ష్యమన్నారు. రాష్ట్ర పునర్నిర్మాణమే తమ లక్ష్యమని వెల్లడించారు. గౌరవ సభను గౌరవించలేని, సంస్కార లేని పార్టీ వైసీపీ అని సీఎం చంద్రబాబు ఫైర్ అయ్యారు.




