07-02-2026 01:38:36 AM
తెలంగాణ వ్యాప్తంగా 332 వార్డుల్లో పోటీ
గాజు గ్లాస్ గుర్తుపైనే బరిలో నిలిచిన పార్టీ అభ్యర్థులు
రాష్ట్రంలో పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారం రద్దు
హైదరాబాద్, ఫిబ్రవరి 6 (విజయక్రాంతి): తెలంగాణ మున్సిపల్ ఎన్నికలపై జనసేన కీలక ప్రకటన చేసింది. మున్సిపల్ ఎన్ని కల్లో 332 వార్డుల్లో ఆ పార్టీ అభ్యర్థులు పోటీ చేస్తున్నట్లు ప్రకటించింది. జిల్లాల వారీగా పోటీచేస్తున్న వార్డుల వివరాలనూ వెల్లడించింది. ఎన్నికల్లో పోటీ చేస్తున్న పార్టీ అభ్యర్థులు బీఫామ్స్ దాఖలు చేయగా, స్థాక ఎన్నికల రిటర్నింగ్ అధికారులు నామినేషన్లను ఆమోదించినట్లు తెలిపింది.
ఈ ఎన్నిక ల్లో జనసేన పార్టీ అభ్యర్థులు గాజు గ్లాస్ గుర్తుపై పోటీ చేస్తున్నట్లు స్పష్టం చేసింది. మున్సిపల్ ఎన్నికల్లో జన సైనికుల, మహిళలు ప్రచారంలో ఉత్సాహంగా పార్టీ అభ్య ర్థుల విజయానికి కృషి చేయాలని ఆ పార్టీ నేతలు కోరారు. జనసేన అధ్యక్షుడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల్లో ప్రచారం చేస్తారని ముందుగా ప్రకటించిన విషయం తెలిసిందే.
అనివార్య కారణాల వల్ల ఆయన తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ప్రచార పర్యట న రద్దు చేసుకున్నట్లు ఆ పార్టీ నేతలు తెలిపారు. గోదావరి జిల్లాలకు తెలంగాణ దిష్టి తగిలిందని పవన్‌కల్యాణ్ చేసిన వ్యాఖ్యలతో అప్పట్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. తెలంగాణ వ్యతిరేకి పవన్ ఎలా పర్యటిస్తారని కాంగ్రెస్‌తో పాటు ఇతర ప్రజా సంఘాలు ప్రశ్నించాయి. అందుకే తెలంగాణలో పవన్ పర్యటన రద్దు చేసుకున్నట్లుగా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
జనసేన పోటీ చేస్తున్న వార్డులు
ఆదిలాబాద్ 10, అశ్వరావుపేట భద్రాద్రి కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ ఇల్లెందు 7, పరకాల జగి త్యాల కోరుట్ల 5, మెట్‌పల్లి రాయికల్ 5, జనగాం స్టేషన్‌ఘన్‌పూ ర్ భూపాలపల్లి 3, ఆలంపూర్ 2, గద్వాల 7, ఐజ 1, బిచుకుంద 2, కామారెడ్డి 7, చొప్పదండి హుజూరాబాద్ జమ్మికుంట కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ 14, ఏదులాపురం 5, కల్లూరు 3, మదిర సత్తుపల్లి 4, ఆసిఫాబాద్ 8, కాగజ్‌నగర్ 2, డోర్నకల్ 1, మహబూబాబాద్ తొర్రూర్ 3, మహబూబ్‌నగర్ కార్పొరేషన్ 18, బెల్లంపల్లి 1, చెన్నూరు క్యాతన్‌పల్లి 4, లక్షిటిపెట్ 3, మంచిర్యాల కార్పొరేషన్ నర్సాపూర్ రామాయంపేట్ అలియాబాద్ మూడు చింతలపల్లి నాగర్‌కర్నూల్ దేవరకొండ మిర్యాలగూడ 2, నల్లగొండ కార్పొరేషన్ 9, మక్తల్ నారాయణపేట్ నిర్మల్ ఆర్మూర్ 2, బీమ్‌గల్ 2, నిజామాబాద్ కార్పొరేషన్ 11, పెద్దపల్లి రామగుండం కార్పొరేషన్ సుల్తానాబాద్ 1, సిరిసిల్ల 7, వేములవాడ 5, ఆమనగల్ 4, ఇబ్రాహీంపట్నం 3, శంకర్‌పల్లి 2, గడ్డిపోతారం ఇంద్రేశం సదాశివపేట్ సంగారెడ్డి 3, జహీరాబాద్ 2, గజ్వేల్ హుస్నాబాద్ 5, హుజూర్‌నగర్ కోదాడ నేరెడ్‌చర్ల 1, సూర్యాపేట తిర్మలగిరి ఆత్మకూరు కొత్తకోట 2, వనపర్తి 2, నర్సంపేట్ 2, వర్దన్నపేట భువనగిరి చౌటుప్పల్ యాదిగిరిగుట్ట వార్డుల్లో జనసేన అభ్యర్థులు బరిలో ఉన్నారు.