07-02-2026 01:38:47 AM
నంగునూరు, ఫిబ్రవరి 6:మండలంలోని తోకల కొండపై వెలసిన శ్రీ సీతారామచంద్రస్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా ముగిశా యి. ఉత్సవాల్లో చివరి రోజైన శుక్రవారం స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని అత్యం త వైభవంగా నిర్వహించారు.ఆలయ పురోహితులు అధిరాల సాయినాథ శర్మ వేద మంత్రోచ్ఛారణల మధ్య,ఆలయ చైర్మన్ కోల రమేష్ గౌడ్ దంపతులు స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించి కళ్యాణాన్ని జరిపించారు.
ఈ వేడుకకు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి మొక్కులు తీర్చుకున్నారు.కళ్యా ణం అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ చేపట్టారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సనాధుల బాలపోచయ్య, ఉప సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షులు కోల శ్రీధర్ గౌడ్, నల్ల పోచమ్మ దేవాలయ కమిటీ చైర్మన్ కోల మహేందర్ గౌడ్, వార్డు సభ్యు లు, పురోహితులు రామాచారి,వివిధ పార్టీల నాయకులు తదితరులు పాల్గొన్నారు.