15 April, 2026 | 9:14 AM

ఇసుక అక్రమ రవాణా ఆపండి

07-02-2026 01:37 AM

నంగునూరు తహశీల్దార్‌కు అక్కెనపల్లి గ్రామస్తుల విన్నపం

నంగునూరు, ఫిబ్రవరి 6:మండల పరిధిలోని అక్కెనపల్లి లో గల పెద్దవాగు నుండి జరుగుతున్న అక్రమ ఇసుక రవాణాను వెం టనే నిలిపివేయాలని కోరుతూ గ్రామస్తులు శుక్రవారం నంగునూరు తహశీల్దార్ ప్రవీణ్ రెడ్డికి వినతి పత్రం అందజేశారు. ఇసుకను విచ్చలవిడిగా తరలించడం వల్ల భూగర్భ జ లాలు తగ్గి,యాసంగి పంటలు ఎండిపోయే పరిస్థితి ఏర్పడిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.

గతంలో పలుమార్లు ఫిర్యాదు చేసి నా ఫలితం లేదని, అక్రమ రవాణాను అడ్డుకుని తమ పంటలను, జీవనోపాధిని కాపా డాలని వేడుకున్నారు.వినతి పత్రం అందజేసిన వారిలో తిప్పని నాగేంద్రం, బి.కిష్టారెడ్డి, రాజయ్య,యాదగిరి,శ్రీను,నాగరాజు,బిక్షపతి,శ్రీనివాస్ ఉన్నారు.