కేరళలో పవన్ ఆధ్యాత్మిక పర్యటన

12-09-2026 | 11:51am

కేరళ: కేరళలోని ప్రముఖ త్రిప్రయార్ శ్రీరామస్వామి ఆలయాన్ని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ దర్శించుకున్నారు. ఆయుర్వేద చికిత్స కోసం కేరళలో ఉన్న ఆయన.. ఆలయానికి చేరుకుని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దీపారాధన సేవలో పాల్గొని విరాళం అందించారు. ‘మీనుట్టు’, ‘వేది వజిపాడు’ సేవల్లోనూ పాల్గొన్నారు. శ్రీరామస్వామి, శ్రీకృష్ణుడు, అయ్యప్పస్వామికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఆలయ అర్చకుల నుంచి తీర్థప్రసాదాలు, వేదాశీర్వచనాలు స్వీకరించారు.


మరిన్ని వార్తలు