15 June, 2026 | 7:34 PM

Breaking News

పాము కాటుతో మృతి చెందిన రాజేశ్వర్ కుటుంబానికి ఆర్థిక సహాయం   •   ఇందిరమ్మ గృహాలను పరిశీలించిన చీఫ్ ఇంజనీర్   •   భారీ వర్షాల నేపథ్యంలో వరద నీరు నిల్వ ఉండకుండా ముందస్తు చర్యల కోసం అధికారుల పర్యటన   •   ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను చేర్పించాలి   •   రేపు పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేత   •   అవినీతి పాల్పడిన జెడ్పీ సీనియర్ అసిస్టెంట్‌పై సస్పెన్షన్ వేటు   •   వెంకట్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే పద్మావతి   •   బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వాలు వేగంగా చేయాలి   •   సెలవులకు ముగింపు... ప్రభుత్వ పాఠశాలల్లో సందడి ప్రారంభం   •   అర్హులైన గిరిజన కుటుంబాలకు ప్రభుత్వం ద్వారా సంక్షేమ పథకాలు   •  

బస్తాకు పది రూపాయలు ఇవ్వండి.. లారీ యజమానుల డిమాండ్

14-05-2026 05:17 PM

 ఇవ్వలేం వద్దు వెళ్లిపోండి రైతులు.

బోథ్. మే 14 (విజయ క్రాంతి): మార్కెట్ యార్డులో ఒక్కో బస్తా పైన పది రూపాయలు అదనంగా ఇవ్వాలని లారీ యజమానులు రైతులను కోరడం జరిగింది. అయితే అందుకు రైతులు తాము ఇవ్వలేమని నిబంధనల ప్రకారం మీరు వస్తానని తీసుకువెళ్లాలని పేర్కొన్నారు. దీంతో లారీ డ్రైవర్ పది రూపాయలు అదనంగా ఇవ్వండి ధాన్యం బస్తాలను తీసుకువెళ్లలేమని నిర్మల్ జిల్లాలో దాన్యం బస్తా ఒకటికి రైతులు అదనంగా 20 రూపాయలు ఇస్తున్నారని మీరు పది రూపాయలు ఇవ్వమంటే ఇవ్వకుండా ఉంటే ఎలా అని పేర్కొన్నారు.

దీంతో ఆగ్రహించిన రైతులు మేం ఇవ్వలేం లారీ పెడితే పెట్టండి లేకుంటే తీసుకు వెళ్ళండి అంటూ జవాబు ఇచ్చారు. ఓ దశలో కొంతమంది రైతులు లారీ డ్రైవర్లతో వాగ్వాదానికి దిగారు. పంటలు పండగ దిగుబడులు రాక తాము నష్టపోతున్నామని ప్రతి వాడు రైతును దోచుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తపరిచారు. దీంతో లారీ డ్రైవర్లు మార్కెట్ యార్డ్ నుండి లారీలను వెనక్కి తీసుకుని వెళ్లారు. ఆక్రయించిన రైతులు ఈ విషయం జిల్లా ఉన్నతాధికారులకు తెలపడం జరిగింది. ధాన్యం తీసుకువెళ్లేందుకు ఒప్పందం కుదుర్చుకున్న కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్లనే ఈ దుస్థితి నెలకొందని రైతులు బాబోతున్నారు