12 July, 2026 | 2:53 PM

Breaking News

చింతల బోరి పంచాయతీలో హెల్ప్ డెస్క్ లో పాల్గొన్న ఉప సర్పంచ్.   •   ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని పర్యవేక్షించిన మండల కాంగ్రెస్ పార్టీ కన్వీనర్   •   ఘనంగా శ్రీ హనుమాన్ చాలీసా సామూహిక పారాయణ   •   సీఎం రేవంత్ వ్యాఖ్యలకు నిరసనగా దిష్టిబొమ్మ దహనం   •   ప్రతి వ్యక్తి ఓటరుగా నమోదు చేయించుకోవాలి   •   రూ.339.59 కోట్లతో భువనగిరి–చిట్యాల నాలుగు లేన్ల రహదారికి శంకుస్థాపన.   •   ఈ నెల 14న కళాశాల బంద్ విజయవంతం చేయాలి   •   ప్రజలకు నాణ్యమైన రహదారి, మౌలిక వసతులు కల్పించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యం   •   స్నాప్‌చాట్, ఇన్‌స్టాగ్రామ్ యాప్‌లను కేంద్ర ప్రభుత్వం వెంటనే నిషేదించాలి   •   ఏజెన్సీ ప్రాంతాల సమస్యలపై ముఖ్యమంత్రికి నివేదన   •  

ప్రత్యేక సమగ్ర సవరణ(SIR)లో ప్రతీ ఒక్కరూ పాల్గొనాలి

14-05-2026 09:40 PM

టీజిఐఐసి చైర్ పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి

హైదరాబాద్: కేంద్ర ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన ప్రత్యేక సమగ్ర సవరణ (SIR)లో ప్రజలందరూ తప్పక పాల్గొనాలని టీజిఐఐసి చైర్ పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి సూచించారు. సంగారెడ్డి మున్సిపాలిటీలోని 24వ వార్డులో  SIRపై  ఏర్పాటు చేసిన  ప్రత్యేక హెల్ప్ డెస్క్ కార్యక్రమంలో ఆమె పాల్గొని అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ  సమగ్ర సవరణ పై అపోహాలు వదిలేయాలని కోరారు. దీనివల్ల ఎవరి ఓటు హక్కు కోల్పొరని అన్నారు. రెండు చోట్ల ఓటు హక్కు ఉన్నవారికి  ఒకటే దగ్గర ఓటు హక్కు పరిమితం అవుతుంది అన్నారు. సమగ్ర సవరణ వల్ల ఓటర్లలో   జవాబుదారీతనం, పారదర్శకత పెరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ షఫీ హఫీజ్, సంగారెడ్డి పట్టణ అధ్యక్షుడు కిరణ్ గౌడ్,  కౌన్సిలర్ నవాజ్, సోహైల్, బబ్బు , సంగారెడ్డి తహశీల్దార్ జైరాం నాయక్ తదితరులు పాల్గొన్నారు.