16 March, 2026 | 11:12 PM

Breaking News

9వ డివిజన్ మేడిపల్లి కాలనీల సమస్యలను వెంటనే పరిష్కరించాలి   •   ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దురాక్రమణ దాడి ఆపాలి   •   కరీంనగర్ రూరల్ తహశీల్దార్‌ను కలిసిన టీఎన్జీవో, టిజీవో నాయకులు   •   విద్యార్థుల స్కాలర్షిప్ & ఫిజు రీయింబర్స్‌మెంట్ విడుదల చేయాలి   •   ఎమ్మెల్యే మందుల సామేలు ఇంటి ముట్టడి.. గుడ్లు, టమాటలతో దాడి   •   రాష్ట్ర బడ్జెట్‌లో విద్యకు నిధులు కేటాయించాలి   •   సమస్య విన్నారు.. పరిష్కారానికి హామీ ఇచ్చారు   •   ప్రాణాపాయ స్థితిలో ఉన్న జీవం పోసిన పశువైద్యాధికారి   •   దోమకొండకు నిధులు మంజూరు   •   అనారోగ్యంతో బాధపడుతున్న యువకుడికి అండగా నిలిచిన ప్రభుత్వ విప్   •  

రూ.840 కోట్లకు పేటీఎం నష్టాలు

20-07-2024 12:59 AM

న్యూఢిల్లీ, జూన్ 19: పేటీఎం బ్రాండ్‌తో పేమెంట్ సర్వీసుల్ని అందిస్తున్న ఒన్97 కమ్యూనికేషన్ నష్టాలు జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో రూ.840 కోట్లకు పెరిగాయి. నిరుడు ఇదేకాలంలో కంపెనీ రూ. 358 కోట్ల నికరనష్టాన్ని చవిచూసింది. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌పై ఆర్బీఐ విధించిన నియంత్రణల కారణంగా పేటీఎం నష్టాలు పెరిగాయి. సమీక్షా త్రైమాసికంలో కంపెనీ మొత్తం ఆదాయం కూడా 33.48 శాతం తగ్గుదలతో రూ.2,464 కోట్ల నుంచి రూ. 1,639 కోట్లకు చేరంది. 

ఈ ఏడాది 12,000 నియామకాలు

తమ వృద్ధిని పెంచుకునేదిశగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 10,000 మంది ఉద్యోగులను నియమించుకుంటామని విప్రో చీఫ్ హెచ్‌ఆర్‌వో సౌరభ్ గోవిల్ చెప్పారు. ఈ ఆర్థిక సంవత్సరానికి  తాము ఆఫర్లు ఇచ్చిన వారందరినీ ఉద్యోగాల్లోకి తీసుకుంటామన్నారు. వారితో పాటు కొత్తగా ఆన్‌క్యాంపస్, ఆఫ్‌క్యాంపస్ హైరింగ్ జరపాలని భావిస్తున్నట్టు వెల్లడించారు. జూన్ 30నాటికి విప్రో రోల్స్‌లో 2,34,391 మంది ఉద్యోగులు ఉన్నారు. ఈ తొలి త్రైమాసికంలో కొత్తగా 337 మంది జత అయ్యారు.