22 June, 2026 | 10:31 PM

సామ్‌సంగ్‌తో పేటీఎం జట్టు

14-06-2024 12:05 AM
  • పేటీఎం యాప్‌లో సామ్‌సంగ్ వ్యాలెట్ ఇంటిగ్రేషన్

న్యూఢిల్లీ, జూన్ 13: ఎలక్ట్రానిక్స్ దిగ్గజం సామ్‌సంగ్‌తో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్టు పేమెంట్స్ ప్లాట్‌ఫాం నిర్వహిస్తున్న పేటీఎం ప్రకటించింది. ఈ భాగస్వామ్య ఒప్పందం ప్రకారం పేటీఎం యాప్‌తో సామ్‌సంగ్ వ్యాలెట్‌ను ఇంటిగ్రేట్ చేస్తారు. పేటీఎం సహకారంతో సామ్‌సంగ్ వ్యాలెట్‌లో కొత్త ఫీచర్లను ప్రారంభిస్తున్నామని, గేలాక్సీ స్మార్ట్‌ఫోన్ యూజర్లు ఈ ఫీచర్ల ద్వారా బస్, ఎయిర్‌లైన్ టికెట్లతో పాటు మూవీ, ఈవెంట్ టికెట్లను కొనుగోలు చేయవచ్చని సామ్‌సంగ్ ఇండియా సీనియర్ డైరెక్టర్ మాధుర్ చతుర్వేది తెలిపారు. 

పేటీఎం జనరల్ ఇన్సూరెన్స్ రిజిస్ట్రేషన్ దరఖాస్తు ఉపసంహరణ

సాధారణ బీమా వ్యాపారం చేసేందుకు పేటీఎం గతంలో సమర్పించిన రిజిస్ట్రేషన్ అప్లికేషన్‌ను తాజాగా ఉపసంహరించుకున్నది. ఈ ఉపసంహరణ దరఖాస్తును ఇన్సూరెన్స్ రెగ్యులేటర్ ఐఆర్‌డీఏఐ ఆమోదించిందని పేటీఎం గురువారం తెలిపింది. తాము ఇక నుంచి తమ సబ్సిడరీ పేటీఎం ఇన్సూరెన్స్ బ్రోకింగ్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా కేవలం బీమా పత్రాల డిస్ట్రిబ్యూషన్‌పైనే దృష్టిపెడతామని పేటీఎం తెలిపింది. హెల్త్, లైఫ్, మోటార్, షాప్, గాడ్జెట్స్ బీమా పత్రాలను మార్కెట్ చేస్తామన్నది. ఈ వార్తల నేపథ్యంలో గురువారం పేటీ ఎం షేరు 7 శాతం మేర పెరిగి రూ.428 వద్దకు చేరింది.