22 May, 2026 | 12:04 PM

రాహుల్, ఖర్గేతో పీసీసీ చీఫ్ భేటీ

27-10-2024 02:41 AM

హైదరాబాద్, అక్టోబర్ 26 (విజయక్రాంతి): ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీని శనివారం ఢిల్లీలో పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ కలిశారు. ఏఐసీసీ చీఫ్‌గా ఖర్గే నియామకమై రెండేళ్లు పూర్తయిన నేపథ్యంలో ఆ యన నివాసానికి వెళ్లి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పార్టీ బలోపేతానికి తీసుకుంటున్న చర్యలను మహేశ్‌కుమార్‌గౌడ్ ఖర్గేకు వివరించారు. ఆ తర్వాత రాహుల్‌గాంధీతో పీసీసీ చీఫ్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ భేటీలో రే వంత్ సర్కారు తీసుకుంటున్న చర్యలు, అమ లు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి రా హుల్‌కు వివరించారు. పీసీసీ చీఫ్‌గా తాను నియామకమై 50 రోజులు పూర్తయిన సందర్భంగా పార్టీ పరంగా అమలు చేస్తున్న కార్యక్రమాలను రాహుల్‌కు తెలియజేశారు.