6 April, 2026 | 3:48 AM

గ్యారెంటీల అమలు కనిపించడం లేదా?

06-04-2026 01:28 AM

కేంద్రమంత్రి కిషన్‌రెడ్డిపై మండిపడ్డ పీసీసీ అధికార ప్రతినిధి బండి సుధాకర్‌గౌడ్

హైదరాబాద్, ఏప్రిల్ 5 (విజయక్రాంతి): ఆరు గ్యారెంటీల అమలుపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉంద ని టీపీసీసీ అధికార ప్రతినిధి బండి సుధాకర్ గౌడ్ అన్నారు. కేంద్రమంత్రి ఆరోపణ లపై ఆదివారం విడుదల చేసిన ప్రకటన మా ధ్యమంగా బండి సుధాకర్ గౌడ్ విమర్శలు సంధించారు. ఎన్నికలకు ముందు సీఎం రేవంత్‌రెడ్డి ప్రజలకు ఇచ్చిన వాగ్ధానాలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ పరిపాలనలో దూసుకుతున్నారన్నారు.

ప్రజల్లో సీఎం రేవంత్ రెడ్డికి వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక కిషన్‌రెడ్డి అసత్యా లను ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణలో ఆరు గ్యారెంటీల అమల్లో భా గంగా విడతల వారీగా రైతు రుణమాఫీ, 50 లక్షల ఇళ్లకు 200 యూనిట్లు ఉచిత విద్యు త్, మహిళకు ఉచిత బస్సు ప్రయాణం, ఇం దిరమ్మ ఇళ్లు, ఆరోగ్యశ్రీ పథకం, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్, 60 వేలకు పై గా ఉద్యోగాల భర్తీ కనిపించడం లేదా? అని ప్రశ్నించారు.