ఫ్రిడ్జ్ పేలి ఇద్దరి మృతి
నిర్మల్ మహాలక్ష్మివాడలో ప్రమాదం
నిర్మల్, ఏప్రిల్ 3 (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా కేంద్రంలో దారుణం జరిగింది. పట్టణంలోని మహాలక్ష్మి వాడలో నివాసం ఉంటున్న ఒడిసెల విజయ్ ఇంట్లో షార్ట్ సర్క్యూట్‌తో ఫ్రిడ్జ్ కంప్రెషర్ పేలి ఇద్దరు దుర్మరణం పాలయ్యారు. శనివారం రాత్రి 11 గంటల సమయంలో ఫ్రిడ్జ్ నుంచి పొగలు రాగా విజయ్ దాన్ని పరిశీలిస్తుండ గా ఒక్కసారిగా కంప్రెషర్ పేలిపోయింది. ఆ మంటలు పక్కనే ఉన్న కూలర్‌కు అంటుకోవడంతో ఇంట్లో మంటలు వ్యాప్తి చెంది దట్ట మైన పొగలు అలముకున్నాయి. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
పోలీసులు ప్రమా ద స్థలానికి చేరుకునే లోపే విజయ్ మృతి చెందగా, ఓ మహిళ కూడా పూర్తిగా కాలిపోయింది. అపస్మారక స్థితిలో ఉన్న ఇద్దరిని నిర్మల్ ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. పిల్లలిద్దరూ వేరే గదిలో ఉండడంతో ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడ్డారని తెలిపారు. ప్రమాదంపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.




