17 March, 2026 | 11:03 AM

ప్చ్.. ఎంత పోరాడినా

11-11-2024 12:00 AM

యూపీ, గుజరాత్‌లకు దక్కని విజయాలు

నోయిడా: నోయిడా లెగ్ ప్రొకబడ్డీ లీగ్ మ్యాచ్‌లు మొదటి రోజే అదిరిపోయాయి. మొదటి మ్యాచ్‌లో యూ ముంబా 35 తేడాతో యూపీ యోధాస్‌పై గెలుపు బావుటా ఎగరేసింది. చివరి వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో యూముంబానే విజయం వరించింది. యూపీ ఆటగాళ్లు చెమటోడ్చినా కానీ విజయం మాత్రం దక్కలేదు. యూపీలో భరత్ సూపర్ టెన్‌తో పాటు ఓ టాకిల్ పాయింట్ సాధించినా కానీ ఫలితం లేకుండా పోయింది. ముంబా జట్టులో లెఫ్ట్ రెయిడర్ అయిన అజిత్ చౌహాన్ (8) టాప్ స్కోరర్. ముంబై కెప్టెన్ స్టార్ డిఫెండర్ సునీల్ కుమార్ రెండు సూపర్ టాకిల్స్‌తో సత్తా చాటాడు. ఫస్ట్ హాఫ్ ముగిసే సరికి 17 తేడాతో హోరాహోరీగా సాగిన మ్యాచ్‌లో చివరకు యూముంబానే విజయం వరించింది. 

గుజరాత్‌కు తప్పని ఘోర ఓటమి.. 

ఇక మరో మ్యాచ్‌లో హర్యానా స్టీలర్స్ 39 తేడాతో గుజరాత్ జెయింట్స్ మీద విజయం సాధించింది. ఆది నుంచే ఆధిపత్యం చెలాయించిన హర్యానా చివరికి వచ్చే వరకు మరింత ముందుకు దూసుకెళ్లింది. గుజరాత్ ఫస్టాఫ్‌లో ఒకసారి, సెకండాఫ్‌లో ఒకసారి ఆలౌట్ అయి ఎక్స్‌ట్రా పాయింట్లను సమర్పించుకుంది. ఈ విజయంతో హర్యానా స్టీలర్స్ మూడో స్థానానికి ఎగబాకింది. తెలుగు టైటాన్స్ రెండో ప్లేస్ నుంచి నాలుగో స్థానానికి పడిపోయింది.