13 April, 2026 | 3:47 AM

శాంతి చర్చలు విఫలం

13-04-2026 02:03 AM

హోర్ముజ్‌ను దిగ్బంధిస్తాం: ట్రంప్

ఇప్పటికి ఇంతే..

  1. అణు పరీక్షలకు స్వస్తి పలకాలని అమెరికా డిమాండ్
  2. ససేమిరా అన్న ఇరాన్.. 
  3. అది తమ సార్వభౌమాధికారమని స్పష్టీకరణ
  4. వెనుదిరిగిన ఇరు బృందాలు.. 
  5. మధ్యవర్తిత్వానికి సిద్ధమన్న రష్యా

ఇస్లామాబాద్, ఏప్రిల్ ౧౨: అమెరికా ఇరా న్ మధ్య పశ్చిమాసియాలో యుద్ధం ముగింపునకు సంబంధించి శాంతి చర్చలు విఫలమ య్యాయి. పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్ వేదికగా శనివారం ౨౧ గంటల పాటు జరిగిన సుదీర్ఘమైన శాంతి చర్చలు ఏ విధమైన ఫలితం రాలేదు. ఇరు దేశాల మధ్య రెండు వారాల కాల్పుల విరమణను శాశ్వత శాంతి ఒప్పందంగా మార్చాలని పాకిస్థాన్ చేసిన ప్రయత్నా లు ఫలించలేదు.

అమెరికన్ బృందం హోర్ముజ్ జలసంధి పునరుద్ధరణ, అణు పరీక్షలకు స్వస్తిపై లిఖితపూర్వక హామీ వంటి డిమాండ్లను ఇరాన్ ముందుంచింది. అందుకు ప్రతిగా ఇరాన్‌పై ఉన్న ఆర్థిక ఆంక్షలను ఎత్తివేస్తామని, యుద్ధం వల్ల దెబ్బతిన్న మౌలిక సదుపాయాల పునరుద్ధరణకు సహకరిస్తామని  ప్రతిపాదించింది. హోర్ముజ్ విషయంలో పట్టువిడిచేందు కు సిద్ధంగా ఉన్నప్పటికీ, అణ్వాయుధ తయారీపై మాత్రం ఇరాన్ ఏమాత్రం వెనక్కి తగ్గలే దు.

అణు పరీక్షలు తమ పౌరుల భద్రత విషయమని, తమ సార్వభౌమాధికారాన్ని అడ్డుకు నే హక్కు ఎవరికీ లేదని తేల్చిచెప్పింది. దీంతో చర్చలు విఫలమై రెండు దేశాల బృందాలు వెనుదిరిగాయి.రెండు దేశాల ప్రతినిధులకు పాకిస్థాన్ ప్రభుత్వ పెద్దలు సర్దిచెప్పడానికి ప్రయత్నించినప్పటికీ, అవి ఫలించలేదు. అయినప్పటికీ పాక్ మరోసారి రెండు దేశాలకు చర్చలకు ఆహ్వానించింది.

అయితే ఆ ప్రతిపాదన నెరవేరే పరిస్థితులు కనిపించడం లేదు. దీనితో రెండు వారాల కాల్పుల విరమణ గడువు ముగియగానే మళ్లీ యుద్ధం మొదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. అణ్వాయుధాల తయారీపై ఇరాన్ వెనక్కి తగ్గకపోవడంతో అమెరికా తన సైనిక చర్యలను మరింత ఉధృతం చేసే అవకాశం ఉంది. మరోవైపు, ఇరాన్ సైతం తన సార్వభౌమత్వాన్ని కాపాడుకునేందుకు హోర్ముజ్ జలసంధిని పూర్తిగా మూసివేసే ప్రమాదం ఉంది.

దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా ఇంధన సరఫరా నిలిచిపోవచ్చు. చమురు ధరలు ఆకాశాన్ని తాకవచ్చు. ఈ పరిణామాలు కేవలం ఆ రెండు దేశాలకే కాకుండా ప్రపంచ ఆర్థిక వ్యవస్థకే పెను సవాలుగా మారబోతున్నాయి. ఇలాఉండగా, మధ్యవర్తిత్వానికి రష్యా ముందుకువచ్చింది. ఇరాన్ అధ్యక్షుడితో మాట్లాడి శాంతి ప్రయత్నాలకు సహాయం చేస్తామని రష్యా అధ్యక్షుడు వ్లాదియర్ పుతిన్ ప్రకటించారు. 

హోర్ముజ్ దిగ్బంధం: ట్రంప్

ఇరాన్‌తో చర్చలు విఫలమైన నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా స్పందించారు. అమెరికన్ దళాలు వెంటనే హోర్ముజ్ జలసంధిని దిగ్బంధిస్తాయని ప్రకటించారు. ఈమేరకు ఆ పని పూర్తి చేయాలని తమ నౌకాదళాన్ని ఆదేశించినట్లు వెల్లడించారు. జలసంధిని తెరుస్తామని ఇరాన్ వాగ్దానం చేసి, మాట తప్పిందని మండిపడ్డారు. జలసంధిలోకి నౌకలు ప్రవేశించకుండా లేదా నిష్ర్కమించకుండా అమెరికన్ నౌకలు కాపుగాస్తాయని వెల్లడించారు.

అంతర్జాతీయ జలాల్లో ఇరాన్‌కు సుంకం చెల్లించిన ప్రతి నౌకను వెంబడించి అడ్డుకోవాలని తమ నౌకాదళానికి ఆదేశాలు ఇచ్చినట్లు ట్రంప్ వెల్లడించారు. చట్టవిరుద్ధమైన ఈ టోల్ చెల్లించే ఎవరికీ అంతర్జాతీయ సముద్రాలపై సురక్షితమైన ప్రయాణం ఉండబోదన్నారు. జలసంధిలో ఇరాన్ అమర్చిన మందుపాతరలను ధ్వంసం చేస్తామన్నారు. శాంతియుతంగా వెళ్లే నౌకలపై దాడులు చేస్తే ప్రతిఘటన తీవ్రంగా ఉంటుందన్నారు.

సరైన సమయం చూసి, తాము ఇరాన్‌ను అంతం చేస్తామని భీషణ ప్రతిజ్ఞ చేశారు. మునుపెన్నడూ చూడని రీతిలో ఆ దేశం దాడులను ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. అణు పరీక్షలను విడిచిపెట్టేందుకు ఇరాన్ సిద్ధంగా లేకపోవడం వల్లే చర్చలు బెడిసికొట్టాయని వివరించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇరాన్ చేతికి అణ్వాయుధాలు చిక్కనివ్వమని తేల్చిచెప్పారు.

చర్చల నుంచి తప్పుకునేందుకే : బాఘేరీ

చర్చలకు ప్రాతినిధ్యం వహించిన ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మొహ్మద్ బాఘేరీ ఘాలిబఫ్ చర్చల్లో అమెరికా తీరును తప్పుబట్టారు. యుద్ధంలో సాధించలేని లక్ష్యాలను అమెరికా,  ఈ చర్చల ద్వారా సాధించాలని చూస్తోందని మండిపడ్డారు. హోర్ముజ్ జలసంధి పునరుద్ధరణ, అణు పరీక్షల విషయంలో ఇరాన్ సార్వభౌమత్వాన్ని దెబ్బతీసేలా అగ్రరాజ్య డిమాండ్లు ఉన్నాయని వివరించారు. చ ర్చల నుంచి తప్పుకునేందుకే ఆ దేశం సాకులు వెతుకుతున్నదని ఆరోపించారు. అమెరికాతో మరో విడత చర్చలు జరిపే ఉద్దేశం ఇరాన్‌కు లేదని ఆయన తేల్చిచెప్పారు.

ఇరాన్ మొండి వైఖరి: నెతన్యాహు

శాంతి చర్చల విఫల్యంపై ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు స్పందిస్తూ.. ఇరాన్ ఎప్పటికీ తన మొండి వైఖరిని వీడదని చర్చల ద్వారా మరోసారి స్పష్టమైందని వ్యాఖ్యానించారు. ఇరాన్ అణు సామర్థ్యాన్ని పూర్తిగా తుడిచిపెట్టడమే ఏకైక మార్గమని ఆయన అభిప్రాయపడ్డారు. అమెరికా తీసుకునే తదుపరి సైనిక చర్యలకు ఇజ్రాయెల్ పూర్తి మద్దతు ఉంటుందని స్పష్టంచేశారు.

ఇరాన్ వైఖరి వల్లే:  జేడీ వాన్స్

అమెరికా ప్రతినిధి బృందానికి నాయకత్వం వహించిన ఆ దేశ ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ చర్చలు జరిగిన తీరుపై మీడియాతో మాట్లాడారు. ఇరాన్ ముందు అమెరికన్ బృందం అత్యుత్తమమైన ప్రతిపాదనలు ఉంచామని, అందుకు ఆ దేశ ప్రతినిధులు అంగీకరించలేదని మండిపడ్డారు.

అణ్వాయుధాలు తయారు చేయబోమనే కనీస హామీని కూడా ఇరాన్ ఇవ్వలేకపోయిందని విమర్శించారు. అందుకు ఇరాన్ త్వరలో తగిన మూల్యం చెల్లించుకుంటుందని పరోక్షంగా హెచ్చరికలు జారీచేశారు.