calender_icon.png 10 October, 2025 | 3:04 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అందుబాటులో శనగ విత్తనాలు

08-10-2025 01:05:47 AM

మద్నూర్, సెప్టెంబర్ 7 (విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా మద్నూర్ మండల కేంద్రంలో గల రైతు ఉత్పత్తిదారుల కంపెనీ లిమిటెడ్ ఆధ్వర్యంలో సెనగ విత్తనాలు అందుబాటులో ఉన్నట్లు రైతు ఉత్పత్తిదారుల సంఘం చైర్మన్ చాట్ల గోపాల్ తెలిపారు. సంఘం పరిధిలో గల రైతులు శనగ విత్తనాలు తీసుకు వెళ్ళచ్చని తెలిపారు.

సంఘం పరిధిలో సభ్యత్వం ఉన్న లేకపోయినా వ్యవసాయ దారులు ఎవరైనా అవసరం గల వారు తీసుకు వెళ్ళచ్చని సంఘం చైర్మన్ తెలియజేశారు. శనగ విత్తనాల బ్యాగు 25 కేజీలది 2050 రూపాయలు 30 కేజీల బ్యాగు 2,460 రూపాయలు ఉన్నట్లు ఆయన తెలిపారు. రైతుల కోసం శనగ విత్తనాలు ఉత్పత్తిదారుల సంఘం ఆధ్వర్యంలో అందుబాటులో సిద్ధంగా ఉంచినట్లు కంపెనీలో సభ్యత్వం గల రైతులకు ముందస్తుగా తెలియజేయడం జరుగుతుందని చైర్మన్ అన్నారు.