08-10-2025 01:06:21 AM
హైదరాబాద్, అక్టోబర్ 7 (విజయక్రాంతి): పెంచిన ఆర్టీసీ బస్సు చార్జీలను ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలని మాజీమంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ డిమాండ్ చేశారు. మంగళవారం ఆయన తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. రేపు (గురువారం) ఛలో బస్ భవన్ కార్యక్రమంలో భాగంగా బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ఆధ్వర్యంలో ఆర్టీసీ ఎండీకి వినతి పత్రం అందజేస్తామన్నారు.