12-10-2025 03:49:19 PM
పెద్ద కొడప్గల్,(విజయక్రాంతి): పెద్ద కొడప్గల్ ముదిరాజ్ నూతన కమిటీ ఏకగ్రీవంగా ఎన్నుకునట్టు కామారెడ్డి జిల్లా కార్యవర్గ సభ్యులు కౌలాస్ సంజీవ్ ముదిరాజ్ గారి ఆధ్వర్యంలో ఆదివారం రోజున మండల కేంద్రం లోని ముదిరాజ్ సంఘం లో సమావేశం ఏర్పాటు చేసి పెద్ద కోడప్ గల్ గ్రామ నూతన కమిటీ కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది, పెద్ద కొడప్గల్ గ్రామ అధ్యక్షునిగా గొర్రె రాములు ఉపాధ్యక్షునిగా బొమ్మల నాగరాజ్, కారడి సాయిలు ప్రధాన కార్యదర్శిగా మాడు జ్ఞానేశ్వర్, కోశాధికారిగా , జక్కుల శంకర్ కు ఏకగ్రీవంగా ఎన్నుకోవడం అయింది.
ఈ సందర్భంగా జిల్లా కార్యవర్గ సభ్యులు మాట్లాడుతూ ముదిరాజ్ బంధువులంతా పార్టీలకతీతంగా ముదిరాజుల ఐక్యత కోసం కలిసికట్టుగా ఉండి మన హక్కుల కోసం పోరాడాల్సిన అవసరం ఉందని ముదిరాజులంతా అన్ని రంగాలలో ముందుకెళ్లాలని అన్నారు అలాగే మనమెంతో మనకంత అనే నినాదంతో రాజ్యాధికార వాటా కోసం పోరాడాలి అని అన్నారు అలాగే ప్రధానమైన సమస్య ముదిరాజులను బిసి డి, గ్రూపు నుంచి, ఏ గ్రూపు,లోకి కలిపే విధంగా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి బీసీ డి గ్రూప్ నుంచి బీసీ ఏ లోకి గ్రూపులో షేర్ చేసే విధంగా మనమందరం ఐక్యంగా పోరాడాలి అని వారు ముదిరాజ్ బంధువులతో కోరడమైనది.