12-10-2025 03:51:53 PM
మందమర్రి,(విజయక్రాంతి): స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వే షన్లు అమలు చేయాలని బీసీ కుల సంఘాల ఐక్యవేదిక జిల్లా అధ్యక్షులు పెద్దపల్లి సత్యనారా యణ డిమాండ్ చేశారు. పట్టణం లో జయశంకర్ చౌరస్తాలో ఆదివారం బీసీ కుల సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యం లో స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీలకు 42 శాతం రిజర్వే షన్లు అమలు చేయాలని కోరుతూ నల్ల బ్యాడ్జీలను ధరించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కామారెడ్డి బీసీ డిక్లరేషన్ ప్రకారం స్థానిక సంస్థలలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని ఎన్నికలలో హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు.
ఒకవైపు స్థానిక సంస్థలలో బీసీ లకు రిజర్వేషన్లు కల్పిస్తూనే మరో వైపు అగ్రవర్ణ పార్టీల నాయకులతో కేసులు వేస్తూ నిలుపుదల చేస్తున్నారని, బీసీలకు రిజర్వేషన్లు అమలు చేయడం రెడ్డిలకు మింగుడు పడడం లేదని ఆయన ఆరోపించారు. కేంద్రంలో బిజెపి ప్రభుత్వం అధికారంలో ఉన్న ప్పటికీ బీసీలకు చట్టసభల్లో ఎన్నికల బరిలో రిజర్వేషన్లు కల్పించడంలో వెనుకడుగు వేస్తుందని విమర్శించారు. అన్ని పార్టీలలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ నాయకులు ఆయా పార్టీల జెండాలు మో స్తూ ఓసీలను అధికారం లోకి తీసుకొస్తున్నారని ఆయన స్పష్టం చేశారు. బీసీలకు రిజర్వేషన్లు అమలుతో భవి ష్యత్తులో ఎస్సీ, ఎస్టీ, బీసీ ముస్లిం మైనారిటీల ఐక్యతతో రాజ్యాధికారం వైపు ప్రయాణం సాగిస్తారనే దురాలోచనతోనే స్థానిక సంస్థలలో బీసీలకు రిజ ర్వేషన్లు అమలు చేయడాన్ని అన్ని రాజకీయ పార్టీలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నా యని ఆయా పార్టీల తీరుపై తీవ్రంగా విరుచుకుపడ్డారు.
స్థానిక సంస్థలలో బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేయకుంటే జిల్లా, రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాస్వామ్య బద్ధంగా ఆందోళన కార్యక్రమా లు ఉదృతం చేస్తామని ఆయ న హెచ్చరించారు. ఈ కార్య క్రమంలో బీసీ కుల సంఘాల ఐక్యవేదిక నాయకులు చిలగాని సుదర్శన్, ఆవిడపు వెంకటేశం, బండారి రాజేశం, మడిపల్లి వెంకటేష్ గౌడ్, గాజుల ప్రతాప్, బై రాజు శ్రీనివాస్, గాదరవేణి బుచ్చయ్య యాదవ్, కొంగ నరసింహులు, వేదుల గురువయ్య, గాజుల శంకర్, కొంగ సత్తయ్య, బైరి శ్రీనివాస్, తరాల రవి, సంగతి రంగనాథ్, గోపిశెట్టి రాజేష్ లు పాల్గొన్నారు.