1 May, 2026 | 4:09 AM

ఘనంగా పెద్దమ్మ తల్లి ఉత్సవాలు ప్రారంభం

01-05-2026 02:34 AM

తాడ్వాయి, ఏప్రిల్ 30( విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండల కేంద్రంలో గురువారం పెద్దమ్మ తల్లి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి నాలుగవ వార్షికోత్సవం సందర్భంగా పెద్దమ్మతల్లి ఉత్సవం మూర్తి విగ్రహాన్ని ఘనంగా ఊరేగించారు. అత్యంత భక్తిశ్రద్ధలతో ఉత్సవ మూర్తిని ప్రత్యేకంగా అలంకరించిన వాహనంలో ఉంచి ఊరేగింపు నిర్వహించారు.

ముదిరాజ్ సంఘం నాయకులు పెద్దలు నృత్యాలు చేస్తూ పాటలు పాడుతూ అందరి ని అలరించారు. మరో రెండు రోజులపాటు పెద్దమ్మతల్లి వార్షికోత్సవ ఉత్సవాలు జరుగుతాయని ముదిరాజ్ సంఘం నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పెద్దమ్మ తల్లి భక్తులు, ముదిరాజ్ సంఘం నాయకులు, గ్రామ పెద్దలు, యువకులు పాల్గొన్నారు.