1 May, 2026 | 4:09 AM

కన్నుల పండువగా కూర్మ నరసింహస్వామి కల్యాణ మహోత్సవం

01-05-2026 02:34 AM

తూప్రాన్, ఏప్రిల్ 30: తూప్రాన్ శివారులోని రామాలయం సమీపం లోని అతి పురాతనమైన స్వయంభుగా వెలసిన శ్రీ కూర్మ నారసింహస్వామి జయంతి కళ్యాణ మహోత్సవం కన్నుల పండువగా నిర్వహించారు. బుధవారం గురువారం రెండు రోజులపాటు స్వామివారికి ప్రత్యేక పూజలు ఆంజనేయ స్వామి వారికి చందన విలేయపదం ఆకుపూజ, ధ్వజారోహణం, సుదర్శన హోమం శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి కళ్యాణ మహోత్సవం ఓడి బియ్యం అన్న ప్రసాద వితరణ కార్యక్రమాలను నిర్వాహకులు దేవాలయ కమిటీ సభ్యులు ఘనంగా నిర్వహించారు.

అన్నప్రసాద కార్యక్రమాన్ని బజారు రూపేష్ అందించారు. ఇందులో నిర్వాహకులు కంటాయపాలెం వేణుగోపాల్, ఆలయ పురోహితులు అహోబిలం ప్రవీణ్, తూప్రాన్ మున్సిపల్ వైస్ చైర్మన్ కొక్కొండ సమతా, కౌన్సిలర్లు సబిత, ముదిరాజ్, బొడ్డు జోత్స్న, మాజీ మున్సిపల్ చైర్మన్ మామిండ్ల జ్యోతికృష్ణ, శివంపేట మాజీ ఎంపీపీ కల్లూరు హరికృష్ణ, బిఆర్‌ఎస్ మండల పార్టీ అధ్యక్షులు బొల్లంపల్లి బాబుల్ రెడ్డి, మాజీ కౌన్సిలర్లు మామిడి వెంకటేష్, శ్రీశైలం గౌడ్, సీనియర్ పాత్రికేయులు జానకిరామ్ గౌడ్, నాగుల వేణుగోపాల్ గౌడ్, బిజెపి సంఖ్య యాదగిరి, బిజెపి నాయకులు, శ్రీ వైష్ణవ సంగం సభ్యులు శ్రీ చూర్ణం విద్యాసాగర్ తిరునగరి, సుధాకర్, విష్ణు, శ్రీధర్, రాము పాల్గొన్నారు.