28 August, 2026 | 2:53 AM

ఎమ్మెల్యే మట్ట రాగమయికి కాంగ్రెస్ నాయకుల శుభాకాంక్షలు

28-08-2026 12:33 AM

కల్లూరు,(విజయక్రాంతి): రాష్ట్ర శిశు సంక్షేమ శాఖ రాష్ట్ర కమిటీ సభ్యురాలిగా,రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్‌గా త్వరలో బాధ్యతలు స్వీకరించనున్న సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్ట రాగమయి దయానంద్‌ను కల్లూరు మండల కాంగ్రెస్ నాయకులు కలిసి శుభాకాంక్షలు తెలిపారు.ఎమ్మెల్యేకు లభించిన ఈ పదవులు నియోజకవర్గానికి మరింత సేవ చేసే అవకాశం కల్పిస్తాయని వారు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు అభినందనలు తెలిపిన వారిలో బైర్ల కాంతారావు,తండు రాములు, ఎం.డి. అయూబ్,కంభంపాటి పుల్లాచారి,కుంచాల గురవయ్య, ఉబ్బన కరుణాకర్ తదితరులు ఉన్నారు.