వృక్షా బంధన్
28-08-2026 12:35 AM
కేసముద్రం,(విజయక్రాంతి): రక్షాబంధన్ సందర్భంగా మహబూబాబాద్ జిల్లా కేసముద్రం పట్టణంలోని శ్రీ వివేకవర్ధిని హై స్కూల్ లో విద్యార్థుల చేత వృక్షాబంధన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. పర్యావరణ పరిరక్షణతో పాటు మానవాళి మనుగడకు వృక్షాల ప్రాముఖ్యతను విద్యార్థులకు వివరించేందుకు రక్షాబంధన్ కార్యక్రమం తో పాటు వృక్షా బంధన్ కార్యక్రమాన్ని నిర్వహించి ప్రతి ఒక్కరూ ఒక మొక్కను నాటి సౌరక్షించే విధంగా చైతన్యం తీసుకురావడానికి ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు పాఠశాల కరస్పాండెంట్ చిర్ర యాకాంతం గౌడ్ తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులు పలు వృక్షాలకు రాఖీ కట్టి వాటిని సంరక్షిస్తామని ప్రతిజ్ఞ చేశారు.






