6 September, 2026 | 11:28 AM

నేరాల నియంత్రణలో సహచారుల పాత్ర కీలకం

28-08-2026 | 12:31am

నేర నియంత్రణలో సహచారుల సహకారం అభినందనీయం

ఎస్ హెచ్ ఓ సైదులు

జవహర్‌నగర్,(విజయక్రాంతి): రక్షాబంధన్ పర్వదినాన్ని పురస్కరించుకుని జవహర్‌నగర్ పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో సహచారి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇన్‌స్పెక్టర్ ఎస్. సైదులు, ఎస్‌ఐ బి. రాము, పోలీస్ సిబ్బంది సహచారులతో సమావేశమై వారి సేవలను అభినందించారు. నేరాల నియంత్రణ, ప్రజా భద్రతలో సహచారులు అందిస్తున్న సహకారానికి గుర్తింపుగా గిఫ్ట్ హ్యాంపర్లను అందజేశారు. ఈ సందర్భంగా ప్రజా సమస్యలు, నేరాలకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు పోలీసులకు తెలియజేయాలని సూచించారు. సహచారుల సమస్యలను సత్వరమే పరిష్కరిస్తామని పోలీసులు హామీ ఇచ్చారు. పోలీసులకు ప్రజలకు మధ్య వారధిగా సహచారులు మరింత చురుకైన పాత్ర పోషించాలని కోరారు.

మరిన్ని వార్తలు