ప్రగతి పథంలో పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రి
జిల్లా ఆసుపత్రిలో ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణరావు
పెద్దపల్లి, జూలై 28(విజయక్రాంతి) పెద్దపల్లి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి పేద ప్రజలకు కార్పొరేట్ స్థాయి ఉచిత వైద్య సేవలు అంది స్తూ రాష్ట్రంలోనే ఉత్తమ కేంద్రంగా నిలుస్తోందని ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింత కుంట విజయరమణరావు తెలిపారు. మంగళవారం ఆసుపత్రిని సందర్శించిన ఆయన, వివిధ వార్డుల్లో రోగులను పరామర్శించి అందుతున్న సేవలపై ఆరా తీశారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావే శంలో ఆసుపత్రి అభివృద్ధి, వైద్య సేవల పురోగతిని వెల్లడించారు.
గత రెండేళ్లలో ఉచిత సేవలు
రూ. 131 కోట్లకు పైగా విలువైన వైద్య సేవలు ఉచితంగా అందజేత, శస్త్రచికిత్సలు & ప్రసవాలు: 2,081 ఆర్థోపెడిక్ (అస్థిపంజర/ఎముకల) సర్జరీలు, 6,478 జనరల్ స ర్జరీలు, 5,067 సురక్షిత, ప్రసవాలు,3,096 ఉచిత కంటి శుక్లాల (కేటరాక్ట్) ఆపరేషన్లు, ఔ షధ పంపిణీ 5 లక్షల మందికి పైగా రోగుల కు ఉచితంగా మందుల పంపిణీ, రోగా నిర్ధారణ: వేలాది స్కానింగ్లు, ఈసీజీలు, ల్యాబ్ ప రీక్షలు ఉచితంగా చేశారు.
రూ. 40 లక్షలతో ఆధునిక వైద్య పరికరాలుకాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆసుపత్రికి రూ. 40 లక్షల వ్యయంతో అత్యాధునిక పరికరాలను సమకూర్చినట్లు తెలిపారు. కంటి, దంత, చెవి-ముక్కు-గొంతు, చర్మ, ఆర్థోపెడిక్, ఊపిరితిత్తుల చికిత్సల కోసం ప్రత్యేక పరికరాలు అందుబాటులోకి తెచ్చారమమని, నవజాత శిశు సంరక్షణ పసిపిల్లల కోసం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసి వార్మర్లు, ఫోటోథెరపీ యూనిట్లు, సీప్యాప్ వెంటిలేటర్లతో మెరుగైన వైద్యం అందిస్తున్నారు.
రూ. 51 కోట్లతో 100 పడకల ఆసుపత్రిగా విస్తరణ
ప్రస్తుతం ఉన్న 50 పడకల ఆసుపత్రిని రూ. 51 కోట్ల భారీ వ్యయంతో 100 పడకల ఆధునిక ఆసుపత్రిగా విస్తరిస్తున్నామని విజయరమణరావు వెల్లడించారు. నిర్మాణ పనులు పూర్తయిన వెంటనే, వచ్చే ఏడాది ప్రారంభంలో ఈ నూతన భవనాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,
ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, జిల్లా మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు సహకారంతో పెద్దపల్లి ఆసుపత్రిని అన్ని రంగాల్లో తీర్చిదిద్దుతామని, తెలంగాణలోని 33 జిల్లాల్లో పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రి అత్యుత్తమ సేవలు అందించడంలో ఇక్కడి వైద్యులు, సిబ్బంది మరియు జిల్లా కలెక్టర్ కృషి అభినందనీయని అన్నారు.ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ శ్రీధర్, వైద్యులు, అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.






