29 July, 2026 | 1:18 AM

పార్టీ బలోపేతం, సంక్షేమ పథకాల అమలులో బీఎల్‌ఏల పాత్ర కీలకం

29-07-2026 12:00 AM

ఐదు మండలాల నుంచి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు భారీగా హాజరు.

సత్తుపల్లి, జూలై 28 (విజయక్రాంతి): ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలో సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మ ట్టా దయానంద్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ బీఎల్‌ఏల సత్తుపల్లి నియోజకవర్గ స్థాయి కీలక సమావేశం నిర్వహించారు.

సత్తుపల్లి పట్టణంలోని లక్ష్మీ ప్రసన్న ఫంక్షన్ హాల్లో నిర్వహించిన సత్తుపల్లి నియోజకవర్గ స్థాయి బీఎల్‌ఏల సమీక్షా సమావేశంలో సత్తుపల్లి శాసనసభ్యురాలు డాక్టర్ మట్టా రాగమయి దయానంద్, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్, ఖమ్మం జిల్లా డీసీసీ అధ్యక్షుడు నూతి సత్యనారాయణ, సత్తుపల్లి నియోజకవర్గ ఇన్చార్జి దయద రవీం ద్ర, పార్లమెంట్ ఇన్చార్జి గోపిశెట్టి రాఘవేంద్రరావు, ఎస్‌ఐఆర్ ప్రోగ్రామ్ సత్తుపల్లి ని యోజకవర్గ ఇన్చార్జి రాయల రాము ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్, డాక్టర్ మట్టా దయానంద్ మాట్లాడుతూ, క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతానికి, ప్రభుత్వ సంక్షేమ ఫలాలను ప్రజలకు చేరవేయడంలో బీఎల్‌ఏల పాత్ర అత్యంత కీలకమని పేర్కొన్నారు. ఓట ర్ల జాబితా నమోదు, సవరణలు మరియు రాబోయే కార్యక్రమాలపై కాంగ్రెస్ పార్టీ బీఎల్‌ఏలకు పలు దిశానిర్దేశాలు చేశారు. కార్యకర్తలు, నాయకులు సమన్వయంతో పనిచేసి ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం అందుబాటులో ఉండాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో సత్తుపల్లి, కల్లూ రు మున్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్లు, ఏఎంసీ చైర్మన్లు, వైస్ చైర్మన్లు, కౌన్సిలర్లు, సత్తుపల్లి, వేంసూరు, పెనుబల్లి, కల్లూరు, తల్లాడ మం డలాలు మరియు సత్తుపల్లి, కల్లూరు పట్టణ కాంగ్రెస్ పార్టీ బీఎల్‌ఏలు, ఐదు మండలాల, పట్టణాల కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు, సత్తుపల్లి నియోజకవర్గంలోని అన్ని గ్రామా ల సర్పంచ్లు, వార్డు సభ్యులు, మండల స్థా యి ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకు లు, కార్యకర్తలు, మహిళలు, యూత్ కాంగ్రె స్, ఎన్‌ఎస్యూఐ నాయకులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.