17 July, 2026 | 5:52 PM

గుండెపోటుతో ఆర్మీ జవాన్ మృతి

04-06-2024 02:55 AM

సిరికొండలో విషాదం

ఆదిలాబాద్, జూన్ 3 (విజయక్రాంతి): ఆదిలాబాద్ జిల్లా సిరికొ ండకు చెందిన సూర్యవంశీ రాజేశర్ (32) భారత సైన్యంలో సైనికుడిగా సేవలందిస్తున్నాడు. ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్‌లో విధులు నిరహి స్తూ ఆదివారం రాత్రి భార్యను ఆదిలాబాద్ రైలు ఎక్కించాడు. ఆ తర్వా త తాను నివాసం ఉంటున్న ఇంటికి వెళ్లాడు. వెళ్లిన కొద్దిసేపటికే గుండెపోటుకు గురై మృతిచెందాడు. ఆయన మృతదేహానికి కుటుంబ సభ్యులు మంగళవారం సిరికొండలో లాంఛనంగా అంత్యక్రియలు చేయనున్నా రు. జవాన్ మృతి గ్రామంలో విషాదాన్ని నింపింది.