01-12-2024 01:46:28 AM
సీనియర్ పాత్రికేయులు టంకశాల అశోక్
హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 30 (విజయక్రాంతి): రచయిత గా, జర్నలిస్ట్‌గా విద్యాభూషణ్ సమాజానికి అందించిన సేవలు చిరస్మరణీ యమని సీనియర్ పాత్రికేయులు టంకశాల అశోక్, సతీష్‌చందర్ కొనియాడారు. ఇటీవల విద్యాభూషణ్ మరణించగా.. బాగ్‌లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో శనివారం ఆయన మిత్రులు, బంధు మిత్రులు సంతాప సభ నిర్వహించారు.
కార్యక్రమంలో వీక్షణం సంపాదకులు ఎన్. వేణుగోపాల్, న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు గోవర్థన్, మాస్‌లైన్ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యు లు హన్మేష్, జర్నలిస్ట్ గౌరీశంకర్, పీవోడబ్ల్యూ రాష్ట్ర కార్యదర్శి గాదె ఝాన్సీ, ఐఎఫ్‌టీయూ నాయకురాలు పద్మ, అరుణ, అనురాధ, ప్రవీణ్, విద్యాభూషణ్ కుమారుడు ఆజాద్, మిత్రులు, కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.