27 July, 2026 | 6:06 PM

Breaking News

బీజిలిపూర్ ఎస్సీకాలనీ కరెంట్ సమస్య పరిష్కరించరా?   •   అర్హులందరికీ ఓటు హక్కు కల్పించాలి: ఎమ్మెల్యే కోరం కనకయ్య   •   భాగీరథిపల్లిలో రూ.25 లక్షల కల్వర్టు నిర్మాణానికి భూమిపూజ   •   ఇల్లందు ఏరియాలో సింగరేణి ఉద్యోగులకు క్వార్టర్ల కౌన్సిలింగ్ నిర్వహణ   •   నేరేడుచర్లలో భాజపా ఆధ్వర్యంలో " సర్" ప్రక్రియపై సమీక్ష   •   రైతులు ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాలి   •   ఎక్స్‌టార్షన్‌కు పాల్పడిన నిందితులు అరెస్ట్.. రిమాండ్   •   తొలిముద్ద కార్యక్రమాన్ని ప్రారంభించిన కార్పొరేటర్ కంచర్ల హిమశ్రీ   •   ప్రభుత్వ, ఆశ్రమ పాఠశాలల్లో సౌకర్యాలు కల్పించాలి   •   వేపల మాధవరం గ్రామానికి మై హోమ్ చేయూత   •  

పెండింగ్ ఫీజు రియింబర్స్‌మెంట్ బకాయిలు వెంటనే ఇవ్వాలి

09-06-2026 01:27 AM

టీఎన్‌ఎస్‌ఎఫ్, టీజేఎస్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్‌కి వినతి

కామారెడ్డి, జూన్ 8 (విజయక్రాంతి): పెండింగ్లో ఉన్న విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ ను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని కోరుతూ సోమవారం కామారెడ్డి ప్రజావాణిలో టీఎన్‌ఎస్‌ఎఫ్, టీజేఎస్ ప్రతినిధులు కలెక్టర్కు వినతి పత్రాన్ని అందజే శారు.పెండింగ్ ఫీజు బకాయిలు రాకపోవడంతో విద్యార్థులకు, యాజమాన్యాలకు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. కోర్సులు పూర్తి అయిన సర్టిఫికెట్లు విద్యార్థులు పొందలేక పోతున్నారని విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని పెండింగ్ బిల్లులను విడుదల చేయాలని కోరారు.

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న ఫీజు బకాయాలను విడుదల చేయాలని కోరుతూ తెలుగునాడు విద్యార్థి సమైక్య (టిఎన్‌ఎస్‌ఎఫ్), తెలంగాణ జన సమితి (టీజేఎస్) ఆధ్వర్యంలో ప్రజావాణిలో జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ కు వినతి పత్రం అందజేశారు.

ఈ సందర్భంగా టిఎన్‌ఎస్‌ఎఫ్ రాష్ట్ర నాయకులు డాక్టర్ బాలు, టీజేఎస్ జిల్లా అధ్యక్షుడు కుంభాల లక్ష్మణ్ యాదవ్ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు ఫీజు బకాయిలు రాకపోవడంతో వివిధ కోర్సులు పూర్తి అయినప్ప టికీ కళాశాలల నుండి వారి యొక్క సర్టిఫికెట్లను పొందలేకపోతున్నారని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలో ఎన్నో సందర్భాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఫీజు బకాయిలను విడుదల చేస్తానని తెలియజేయడం జరిగింద న్నారు.వెంటనే ప్రభుత్వం పెండింగ్ ఫీజు బకాయాలను విడుదల చేసి న్యాయం చేయాలని వారు కోరారు.