9 April, 2026 | 6:51 PM

Breaking News

అల్లూరి జిల్లాలో విషాదం— సెల్ఫీ సరదా విషాదంగా మారింది.. జలపాతంలో పడి ముగ్గురు మృతి   •   బాన్సువాడలో పలు రైస్ డిపోలపై సివిల్ సప్లై అధికారుల దాడులు   •   కేరళలో 75 శాతం పోలింగ్‌ నమోదు   •   ప్రగతి నగర్‌లో ఘనంగా ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాలు   •   ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న సమస్యలను సత్వరమే పరిష్కరించాలి...   •   హెచ్ఐవిపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి   •   ఏజెన్సీ ప్రాంత రైతుల భూ సమస్యలను పరిష్కరించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు   •   హనుమకొండ జిల్లాను వరంగల్ జిల్లాలో కలిపి మహానగరాన్ని అభివృద్ధి చేయండి   •   బీజేపీ ఆధ్వర్యంలో ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డు నమోదు   •   ప్రభుత్వ విద్య బలోపేతానికి కృషి చేస్తా..   •  

ఏడుపాయల జాతర పెండింగ్ పనులు పూర్తి చేయాలి

13-02-2026 06:28 PM

భక్తులకు అసౌకర్యకం కలుగకుండా చర్యకు చేపట్టాలి

ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ 

పాపన్నపేట: ఏడుపాయల వనదుర్గామాత  సన్నిధిలో మహాశివరాత్రికి మూడు రోజులపాటు నిర్వహించనున్న జాతరకు విచ్చేసే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు చేపట్టాలని, మహా జాతర పెండింగ్ పనులు శనివారం మధ్యాహ్నం వరకు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఏడుపాయల జాతర ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. భక్తులకు అసౌకర్య కలవకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.

ట్రాఫిక్, త్రాగునీరు, పార్కింగ్, సంస్కృతిక కార్యక్రమాలు, దర్శన ఏర్పాట్లు, ఇతర పెండింగ్ లో ఉంటే త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. ఈ సంవత్సరం జాతరకు దాదాపు పది లక్షల మంది భక్తులు హాజరయ్యే అవకాశం ఉన్నందున వారికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి జాతరను ప్రశాంతంగా ముగించాలన్నారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో వీరేశం, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.