2 September, 2026 | 7:24 PM

యాపిల్ సీఈఓగా టిమ్ కుక్ పదవీ విరమణ

02-09-2026 | 06:49pm

టెక్ దిగ్గజానికి 15 ఏళ్ల పాటు నాయకత్వం వహించిన టిమ్ కుక్(Tim Cook) యాపిల్ కంపెనీ సీఈఓ పదవి నుండి వైదొలగారు. కుక్ ఆగష్టు 2011లో స్టీవ్ జాబ్స్ స్థానంలో బాధ్యతలు స్వీకరించారు. ఐఫోన్ తయారీ సంస్థలో ఆయన రికార్డు స్థాయిలో 15 సంవత్సరాల పదవీకాలాన్ని కొనసాగించారు. ఈ కాలంలో ఆపిల్(Apple) వాచ్, ఎయిర్‌పాడ్స్‌ల విడుదల, అలాగే ఐఫోన్(iPhone), ఐప్యాడ్, మ్యాక్ శ్రేణులలో ప్రధాన విస్తరణలు జరిగాయి. యాపిల్ లో ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా తన కొత్త ఉద్యోగంలో, కుక్ అమెరికా, చైనా ప్రభుత్వాలతో సహా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వాలతో కలిసి పనిచేయడానికి బాధ్యత వహిస్తారు. 

యాపిల్ సీఈఓ(Apple CEO) టిమ్ కుక్, తాను చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పాత్రను మిస్ అవుతానని, కానీ తన స్థానంలోకి వచ్చిన జాన్ టెర్నస్(John Ternus) నాయకత్వం పట్ల తనకు అపారమైన భరోసా ఉందని ఉద్యోగులతో అన్నారు. తాను యాపిల్ ను విడిచిపెట్టడం లేదని, నేను ఎంతో ప్రేమించిన పాత్ర నుండి తప్పుకుంటున్నానని కుక్ పేర్కొన్నారు. 1998లో టిమ్ కుక్ కాంపాక్(compaq) అనే కంపెనీలో మంచి హోదాలో పని చేస్తున్నారని, ఆ సమయంలో ఆయన వేతనం 30 మిలియన్ డాలర్లు. కానీ యాపిల్ కంపెనీలో 3 మిలియన్ డాలర్లు మాత్రమే.  దివాలా అంచున ఉన్న యాపిల్ సంస్థ నుంచి వచ్చిన ఆఫర్ ను కుక్ తిరస్కరించారు. తాను చేస్తున్న ఉద్యోగంలోనే తనకు ఆనందం ఉందని 2014లో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో టిమ్ కుక్ చెప్పారు. 1998లో యాపిల్ లో సినియర్ వైస్ ప్రెసిడెంట్ గా చేశారు. వివిధ హోదాల్లో పని చేసి 2011 లో స్టీవ్ జాబ్స్ నుంచి నాయత్వ బాధ్యతలు చేపట్టారు.