పెన్షనర్ల రిటైర్మెంట్ బకాయిలు వెంటనే చెల్లించాలి
రాష్ట్ర కో కన్వీనర్ శ్రీధర్ల ధర్మేంద్ర
హనుమకొండ టౌన్,(విజయక్రాంతి): రిటైర్డ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ బకాయిల సాధన రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు, మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల కలెక్టరేట్ల ముందు నిరసన కార్యక్రమంలో భాగంగా హనుమకొండ, వరంగల్ జిల్లాల కలెక్టరేట్ల ముందు రాష్ట్ర కోన్వీనర్ శ్రీధర్ల ధర్మేంద్ర, జిల్లా ప్రధాన కార్యదర్శి కడారి భోగేశ్వర్, జిల్లా అసోసియేట్ అధ్యక్షులు కందుకూరి దేవదాసు ల ఆధ్వర్యంలో రిటైర్డ్ ఎంప్లాయిస్ నిరసన ప్రదర్శన నిర్వహించారు.
అనంతరం వారు మాట్లాడుతూ... మార్చి 2024 నుండి ఫిబ్రవరి 2026 వరకు, రిటైర్డ్ అయిన ఎంప్లాయిస్ కు సంబంధించిన బకాయిలు చెల్లించాలని, వివిధ రకాలగా ఉద్యమాలు గత ఆరు నెలల నుండి చేస్తున్నప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వం బకాయిలు చెల్లించని కారణంగా, రాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్షాలు రిటైర్మెంట్ బకాయిలు చెల్లించాలని కోరినప్పటికీ, ప్రభుత్వం ఒక స్పష్టమైన నిర్దిష్టమైన విధానంను ప్రకటించాలని, పెన్షనర్ల సమస్యల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఏమాత్రం మానవత్వం, దయ, కనికరం లేకుండా ప్రదర్శిస్తున్న వైఖరి నిరసనగా మంగళవారం అసెంబ్లీ సమావేశాలు ముగింపు రోజు సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ, హనుమకొండ జిల్లా జాయింట్ కలెక్టర్, వరంగల్ జిల్లా కలెక్టర్ సత్య శారద లకు మెమొరండం అందించడం జరిగిందని అన్నారు.




