కాంగ్రెస్‌కి ప్రజలు, కార్యకర్తలు పటిష్టమైన నాయకత్వాన్ని అందించాలి
ఏఐసీసీ ప్రధాన పరిశీలకులు నరేష్ కుమార్
బెల్లంపల్లి, అక్టోబర్ 17 : కాంగ్రెస్ పార్టీకి ప్రజలు, కార్యకర్తలు పటిష్టమైన నాయకత్వాన్ని అందించాలని ఏఐసీసీ ప్రధాన పరి శీలకులు డాక్టర్ నరేష్ కుమార్ అన్నారు. శుక్రవారం మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం కన్నాల గ్రామపంచాయతీ పరిధిలో గల ఆర్పి గార్డెన్స్‌లో ఏర్పాటుచేసిన సంఘటన్ సృజన్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే గడ్డం వినోద్ సమక్షంలో డిసిసి అధ్యక్ష పదవి కోసం కాం గ్రెస్ ఆశావాహుల నుంచి దరఖాస్తులను స్వీకరించారు.
ప్రధానంగా పోటీలో నిలిచిన కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ కన్వీనర్ నాతరి స్వామి, బెల్లంపల్లి మాజీ జెడ్పిటిసి కారుకూరి రాంచందర్, బెల్లంపల్లి మాజీ మున్సిపల్ చైర్మన్ ఎం.సూరిబాబు, రాములు నాయక్‌లతోపాటు నియోజక వర్గంలోని పలువురు కాంగ్రెస్ సీనియర్ నాయకులు డిసిసి అధ్యక్ష పదవి కోసం దరఖాస్తులను సమర్పించారు.
ఎమ్మెల్యే గడ్డం వినోద్ మాట్లాడుతూ కాంగ్రెస్‌లో సీనియార్టీని, చేపట్టిన పదవులను దరఖాస్తుల్లో ఆశావహులు వ్యక్త పరచాలన్నారు. పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు ముచ్చర్ల మల్లయ్య అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీలు దండే విఠల్, పురాణం సతీష్, కాంగ్రె స్ పార్టీ పరిశీలకులు ఏ. జ్యోతి, అనిల్ కుమార్, శ్రీనివాస్‌తో పాటు, బెల్లంపల్లి మాజీ ఎంపీపీ తొంగల మల్లేష్, మాజీ ఎం పీటీసీ ఎం.మహేందర్ తదితరులు పాల్గొన్నారు.






