14 March, 2026 | 6:38 PM

విద్యారంగ వ్యవస్థను బలోపేతం చేయడానికి అనేక చర్యలు

18-10-2025 12:00 AM

కలెక్టర్ హనుమంతరావు 

యాదాద్రి భువనగిరి, అక్టోబర్ 17 (విజయక్రాంతి) ః విద్యారంగ వ్యవస్థను బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతుందని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంత రావు అన్నారు. శుక్రవారం ఆలేరు మండలం కొల్లూరు గ్రామంలో జెడ్పీఎచ్ ఎస్ స్కూల్ ని ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్. స్కూల్ లో మొత్తం ఎంత మంది విద్యార్ధులు ఉన్నారని తెలుసుకున్నారు . ఇప్పుడు 10 వ తరగతిలో ఎంత  మంది విద్యార్థులు వున్నారని.

ఇప్పటి వరకు సిలబస్ ఎంత మేరకు పూర్తి అయిందని స్కూల్ ప్రిన్సిపాల్ ని కలెక్టర్ అడగడం జరిగింది. 10 వ తరగతిలో సోషల్ స్టడీస్ క్లాస్  కి వెళ్లి కలెక్టర్ విద్యార్థులతో కలిసి వినడం జరిగింది.విద్యార్థుల తో ఇండియా మ్యాప్ వేయించారు. విద్యార్థులు అందరూ ఇప్పటి నుండి  వార్షిక పరీక్షలకు సిద్ధం కావాలని  అన్నారు. ఈ సంవత్సరం కూడా ఈ స్కూల్ లో 100% ఉత్తీర్ణత సాధించాలని కోరారు.. ఎక్కువ మార్కులు వచ్చిన వారికి సైకిల్స్ బహుమతి గా ఇవ్వడం జరుగుతుందని .

మీ తల్లిదండ్రులను సన్మానించడం జరుగుతుందని అన్నారు. అదే పాఠశాలలో బయాలజీ టీచర్ విద్యార్థుల కోసం ప్రత్యేకంగా ఎగ్జామ్ కోసం మెటీరియల్ తయారు చేసి పంపిణి చేయడం గురించి తెలుసుకొని కలెక్టర్ ఉపాధ్యాయుని అభినందించి, శాలువాతో సత్కరించారు. అనంతరం ఆలేరు మండలం కొల్లూరు గ్రామంలో అంగన్వాడీ సెంటర్ ని కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేశారు.అంగన్వాడీ సెంటర్ లో మొత్తం ఎంత మంది చిన్నారులు ఉన్నారని, చిన్న పిల్లలు రోజు అంగన్వాడీ కేంద్రానికి ఎంతమంది వస్తున్నారని అడిగి తెలుసుకున్నారు. అంగన్వాడి  కేంద్రానికి గర్భిణి స్త్రీలు ఎంతమంది వస్తున్నారని. వారికి కూడా రోజు పోషక ఆహారం పెడుతున్నారా అని ఆరా తీశారు.

ఇంకా ఈ గ్రామంలో మన అంగన్వాడీ సెంటర్ కి రాని పిల్లలు ఎంత మంది ఉన్నారని, వారిని కూడా గుర్తించి  అంగన్వాడీ సెంటర్ కి వచ్చేలా చూడాలన్నారు. అనంతరం  ఆలేరు మండలం కొల్లూరు గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను పరిశీలించారు. అనంతరం ఆలేరు మండలం కొల్లూరు గ్రామంలో పల్లె ప్రకృతివనాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్... ఎన్ని మొక్కలు నాటారు. రోజు ఓపి ఎంత మంది పేషెంట్లు  వస్తున్నారని అడిగి తెలుసుకున్నారు. వచ్చే పేషెంట్లు ఏ ఏ రోగాలతో వస్తున్నారని.

మందులు అన్ని ఉన్నాయా అని అడిగారు. గత నెలలో ఎన్ని ఈ డిడిలు ఉన్నాయని. ఈ నెలలో ఎన్ని ఉన్నాయ అధికారులు తెలిపారు. ఆలేరు కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లో డెలివరీ చేయించుకున్న జ్యోతి అనే బాలింత మహిళతో ఫోన్ లో మాట్లాడారు. పుట్టిన బిడ్డ, మీ ఆరోగ్యం ఎలా ఉందని తెలుసు కున్నారు. ఆలేరు ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది ఏమైనా ఇబ్బంది పెట్టారా. హాస్పటల్ సిబ్బంది  మీ దగ్గర డబ్బులు  అడగడం జరిగిందా మీరు ఏమైనా ఇచ్చారా అని కలెక్టర్ ఆరా తీశారు.