09-11-2025 12:05:19 PM
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఐదు రాష్ట్రాల్లో కీలక ఆపరేషన్ చేపట్టింది. సైబర్ నేరాలకు పాల్పడుతున్న 81 మందిని ఆంధ్రప్రదేశ్, కేరళ, మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో పోలీసులు అరెస్టు చేశారు. నిందితులపై దేశవ్యాప్తంగా 754 కేసులు ఉన్నాయని, వీరు దాదాపుగా రూ.95 కోట్ల విలువైన సైబర్ మోసాలు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితుల్లో 17 మంది ఏజెంట్లు, ఏడుగురు మహిళలు, 58 మంది మ్యూల్ ఖాతాదారులున్నట్లు సమాచారం. వారి నుంచి 84 సెల్ ఫోన్లు, 101 సిమ్ కార్డులు, 89 బ్యాంకు పాస్ బుక్ లు, చెక్ బుక్ లు స్వాధీనం చేసుకున్నారు. ఖాతాలోని కోట్ల రూపాయల నగదును ఫ్రీజ్ చేసి బాధితులకు అందించనున్నట్లు సైబర్ సెక్యూరిటీ బ్యూరో వెల్లడించింది.