రాజ్‌కోట్‌లో అగ్నిప్రమాదం 27 మంది సజీవ దహనం
రాజ్‌కోట్, మే 25: ఓ గేమింగ్ జోన్‌లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. గుజ రాత్‌లోని రాజ్‌కోట్‌లో శనివారం ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 2౭ మంది సజీవ దహనం అయ్యారు. మృతుల్లో తొమ్మిది మంది పిల్లలు ఉన్నారు. మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉన్నట్టు అగ్నిమాపక సిబ్బంది చెబుతోంది. ప్రమాదం జరిగిన వెంటనే సమాచారం తెలుసుకున్న ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టింది. అయితే అప్పటికే దట్టమైన పొగతో మంటలు వ్యాపించడంతో ఎక్కువ ప్రాణనష్టం జరిగింది.
ఈ ప్రమాదానికి కారణాలేంటో ఇంకా తెలియలేదు. సహాయక చర్యలు చేపట్టాలని గుజరాత్ ముఖ్య మంత్రి భూపేంద్ర పటేల్ అధికారులను ఆదేశించారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని ఆదేశాలు జారీ చేశారు. దాదాపు ౨౫ మృతదేహాలను బయటకు తీశారు. గేమ్‌జోన్ యజమాని, మేనేజర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. జరిగిన విషాద ఘటనపై విచారణకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారు.
మోదీ విచారం..
‘రాజ్‌కోట్‌లో అగ్ని ప్రమాదం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. తమ సన్నిహితులను కోల్పోయిన కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి. క్షత గాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా. స్థానిక అధికార యం త్రాంగం వారికి సాయం చేసేందుకు తీవ్రంగా శ్రమించింది’ అని ప్రధాని మోదీ ఎక్స్‌లో పోస్టు చేశారు.






