10-11-2025 10:53:58 PM
- వాటర్ బోర్డ్ ఆఫీస్ లో కాళీ కుర్చీకి వినతిపత్రం
- సమస్యలను చెప్పడానికి వస్తే... అధికారులు లేరు
- డ్రైనేజ్ సమస్యను పరిష్కరించాలని హయత్ నగర్ డివిజన్ ప్రజల డిమాండ్..
ఎల్బీనగర్: పేరుకే ప్రజావాణి... సమస్యలను చెప్పడానికి వస్తే అధికారులు ఆఫీస్ లో ఉండడం లేదు... దీంతో ఖాళీ కుర్చీకి వినతి పత్రం అందజేశారు. ఈ ఘటన సోమవారం హయత్ నగర్ డివిజన్ లోని వాటర్ బోర్డు కార్యాలయంలో చోటు చేసుకుంది. ఎప్పుడూ అందుబాటులో ఉండని వాటర్ బోర్డ్ అధికారులు కానీసం ప్రజావాణిలో అయిన అందుబాటులో ఉంటారని వచ్చిన కాలనీవాసులు ప్రజావాణిలో కూడా కనిపించకపోవడంతో కాళీ కుర్చీకి వినతి పత్రం అందించి నిరసన తెలిపారు. ఈ ఘటన హయత్ నగర్ లో జరిగింది. కాలనీ వాసులు తెలిసిన వివరాల ప్రకారం హయత్ నగర్ లోని కుమ్మరి కుంట చెరువుకు ఆనుకొని సుమారు 15 కాలనీలు ఉన్నాయి.
అయితే ఈ కుమ్మరి కుంట చెరువులో గత కొంతకాలంగా అధికారులు డ్రైనేజ్ ను కలిపారు దీంతో చెరువుకు ఆనుకొని ఉన్న 15 కాలనీలలో పాటు దగ్గరలోని మరో 15కాలనీలకు దుర్గంధపు వాసన వస్తూ కాలనీల వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇదే విషయాన్ని పలుమార్లు అధికారులకు విన్నవించుకున్న సమస్య తీరలేదు దీంతో సోమవారం ప్రజావాణిలో అధికారులు కచ్చితంగా ఉంటారని బావుంచి కాలనీల అధ్యక్ష, కార్యదర్శులు, కాలనీల వాసులు సోమవారం ప్రజావాణిలో ఫిర్యాదు చేసేందుకు హయత్ నగర్ లోని 11వ డివిజన్ వాటర్ బోర్డ్ కార్యాలయానికి చేరుకున్నారు.అయితే అక్కడ ఫిర్యాదు చేసేందుకు ఒక్క అధికారి కూడా కనిపించలేదు దీంతో వారు కాళీగా ఉన్న మేనేజర్ కుర్చీకి వినతి పత్రం అందించి నిరసన తెలిపారు.
ఈ సందర్భంగా కాలనీల వాసులు మాట్లాడుతూ భరించలేని కంపుతో తాము అనారోగ్యభారిన పడుతున్నామని ఇదే విషయంలో ఎన్ని ఫిర్యాదులు ఇచ్చిన సంబంధిత వాటర్ బోర్డ్ అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని అన్నారు. వాటర్ బోర్డ్ ఆఫీస్ ముందు బైఠాయించి ధర్నా చేశారు. ఎప్పుడు వచ్చినా అధికారులు అందుబాటులో ఉండడం లేదని ఆరోపించారు. స్థానిక ప్రజాప్రతినిధులు వచ్చి చూసి వెళ్తున్నారని కానీ ఎవ్వరు పరిష్కారం దిశగా ఆలోంచించడం లేదన్నారు.చెరువు నుండి వచ్చే కంపుతో చిన్న పిల్లలు వృద్ధులు అనారోగ్యబారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.నేరుగా తమ గోడు విన్నవించుకునేందుకు ప్రజావాణిలో కలిసేందుకు వస్తే కూడా అందుబాటులో లేరన్నారు.ఇప్పటికైనా పై అధికారులు స్పందించి తమకు మురుకి కంపు నుండి విముక్తి కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వసూపరి కాలనీ జనార్దన్ రెడ్డి, గౌరవ అధ్యక్షుడు జంగయ్య, శాంతి నగర్ అధ్యక్షుడు గాయం గోపాల్ రెడ్డి ప్రేమ్ నాధ్ శర్మ, ఆలూరి సందీప్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.