10-11-2025 10:56:16 PM
మహబూబ్ నగర్ (విజయక్రాంతి): ఢిల్లీలో జరిగిన పేలుళ్లకు సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో క్లాక్ టవర్ నందు వాహనాలను పోలీసులు ప్రత్యేకంగా తనిఖీలు నిర్వహించారు. అనుమానాస్పదంగా అనిపించిన ఆ ప్రాంతాలను ప్రత్యేకంగా పరిశీలిస్తూ తనిఖీలు చేపడుతున్నారు. ద్విచక్ర వాహనాలతో పాటు కార్లు ఇతర వాహనాలను కూడా పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. ఈ తనిఖీల్లో వన్టౌన్ సిఐ అప్పయ్య, ఎస్సై తదితరులు ఉన్నారు.