26 March, 2026 | 2:33 AM

బ్రిడ్జి నిర్మాణంలో నాణ్యత లోపిస్తుందా?

26-03-2026 12:46 AM

నిర్మిస్తే సరిపోతుందా నాణ్యత అక్కర్లేదా!

బ్రిడ్జి నిర్మాణ పనులు చూసి అసహనం వ్యక్తం చేస్తున్న ప్రజలు

చిన్న చింతకుంట మార్చి 25: మండల కేంద్రం నుంచి ఉంద్యాల  హైలెవల్ బ్రిడ్జి శంకుస్థాపన గత నెల  24న చేసిండ్రు.  హై లెవల్ బ్రిడ్జి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ప్ర ధానమంత్రి గ్రామీణ సడక్ యోజన కింద ఈ బ్రిడ్జి నిర్మాణం నిధులు మంజూరైనట్లు తెలుస్తుంది.  రూ 1.70 కోట్ల నిధుల ఖర్చు తో ఈ బ్రిడ్జి నిర్మాణానికి ప్రభుత్వం కేటాయించింది. ప్రజలకు ఎంతో ఉపయోగప డేందుకు ప్రభుత్వాలు నిధులు కేటాయించి బ్రిడ్జిలు నిర్మాణం చేపడుతుంటే కొందరు కాంట్రాక్టర్లు నిర్లక్ష్య కారణంగా బ్రిడ్జి నాణ్యత లోపిస్తుందని గ్రామస్తులే పలువురు పేర్కొంటున్నారు.

వర్షాకాలంలో వరద నీరు పొం గినప్పటి రోడ్డు ముంపు సమస్యలు గణనీయంగా తగ్గుతాయని స్థానికులు ఎంతో ఆశగా ఈ బుజ్జి నిర్మాణం పూర్తి ఎప్పుడు అ వుతుందని ఎదురుచూస్తుండ్రు. ప్రజల రవా ణా సౌలభ్యం కోసం కోట్ల రూపాయల వె చ్చించి నిర్మిస్తున్న బ్రిడ్జి పనుల్లో నాణ్యత గా లికి వదిలేశారు. నిర్మాణ దశలోనే పిల్లర్ల వద్ద సిమెంట్ సరిగ్గా అంటుకోక కంకర రాళ్లు బ యటకు కనిపిస్తుండటం స్థానికుల్లో ఆందోళన కలిగిస్తోంది.

- పర్యవేక్షణ లోపం..

కాంక్రీట్ వేసే సమయంలో సరైన నిష్పత్తి పాటించకపోవడం లేదా ’వైబ్రేటర్’ సరిగ్గా ఉపయోగించకపోవడం వల్ల ఇలా హనీకోంబింగ్ ఏర్పడినట్లు తెలుస్తోంది.లోపల ఉం డాల్సిన ఇనుప చువ్వలుగాలికి, తేమకు గు రైతే తుప్పు పట్టి, భవిష్యత్తులో బ్రిడ్జి పటిష్టత దెబ్బతినే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పనులు జరుగుతున్న సమయంలో సంబంధిత ఇంజనీర్లు క్షేత్రస్థాయిలో ఉండి పర్యవేక్షించకపోవడం వల్లే కాం ట్రాక్టర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఎండిపోతున్న క్యూరింగ్ సంచులు.ప్రభుత్వం కోట్ల రూపాయలు వెచ్చించి నిర్మిస్తున్న వంతెనల పనులు అస్తవ్యస్తంగా మారుతున్నాయి. కాంక్రీట్ వేసిన తర్వాత అత్యంత కీలకమైన క్యూరింగ్‌ప్రక్రియను కాంట్రాక్టర్లు మరియు పర్యవేక్షణ అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.బ్రిడ్జి పిల్లర్లు, స్లాబ్ గట్టిపడాలంటే కనీసం 14 నుండి 21 రోజుల పాటు నిరంతరం నీటితో తడపాలి. ఇందుకోసం వేసిన తట్టుకోర్లు  పూర్తిగా ఎండిపోయి కనిపిస్తున్నాయి. ఎండ వేడికి కాంక్రీట్ లోని తేమ ఆరిపోయి, లోపల పగుళ్లు  వచ్చే ప్రమాదం ఉందని తెలుస్తుంది. 

పిల్లర్ల వద్ద ఉన్న లోపాలను వెంటనే సరిచేపిస్తాం 

బ్రిడ్జి నిర్మాణంలో పూర్తిస్థాయిలో ప్రభుత్వంగా నిర్మించేందుకు అవసరమై న చర్యలు తీసుకుంటాం. ఎక్కడైనా కంక ర తెలియనట్లు కనిపిస్తే పటిష్టంగా ఉండేందుకుగాను తీసుకోవాల్సిన చర్య లు తీసుకుంటాం. అన్ని పనులు సక్రమంగా చేయాలని కాంట్రాక్టర్కు సూచన లు చేసి నాణ్యతగా ఉండేలా చేస్తాం.

శివ కుమార్, పిఆర్ ఏఈ