03-02-2026 02:24:53 AM
డ్రైవింగ్ లైసెన్స్ లేని నలుగురికి రూ.20వేలు
సిద్దిపేట క్రైం, ఫిబ్రవరి 2 : మద్యం తాగి వాహనాలు నడిపిన 11 మందికి సిద్దిపేట స్పెషల్ సెకండ్ క్లాస్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కాంతారావు రూ.లక్షా 12వేల 5వందల జరిమానా విధించారని ట్రాఫిక్ సీఐ ప్రవీణ్ కుమార్ తెలిపారు. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడిపిన నలుగురికి రూ.5 వేల చొప్పున రూ.20వేలు జరిమానా విధించారని చెప్పారు. ఇటీవల నిర్వహించిన తనిఖీల్లో వారు నిబంధనలు అతిక్రమించి పట్టుబడ్డారని తెలిపారు.