calender_icon.png 3 February, 2026 | 4:13 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చెరువులు, కుంటల ఆక్రమణలపై ఉక్కుపాదం

03-02-2026 02:26:32 AM

రెండు ఎకరాల్లో స్లాటర్ హౌస్ ఏర్పాటు 

అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలి 

జిహెచ్‌ఎంసి సమీక్షా సమావేశంలో ఎమ్మెల్యే జిఎంఆర్ 

పటాన్చెరు, ఫిబ్రవరి 2: ప్రభుత్వ భూములలో లేఔట్లు, అనుమతి లేని అక్రమ నిర్మా ణాలు, చెరువులు, కుంటల కబ్జా కొనసాగకుండా క్షేత్రస్థాయిలో తనిఖీలు చేస్తూ కబ్జా దారుల పైన ఉక్కుపాదం మోపాలని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం పటాన్చెరు డివిజన్ పరిధిలోని క్యాంపు కార్యాల యంలో జిహెచ్‌ఎంసి, రెవెన్యూ, ఇంజనీరింగ్ శాఖ అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. అమీన్పూర్, పటాన్చెరు బల్దియా సర్కిళ్ల పరిధిలో చేపడుతున్న అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలని.. నాణ్య త ప్రమాణాల్లో రాజీ పడకుండా నిర్దేశించిన గడువులోగా పనులు పూర్తి చేయాలని జిహెచ్‌ఎంసి అధికారులను ఆదేశించారు. పటా న్చెరు అమీన్పూర్ సర్కిల్ల పరిధిలోని డివిజన్లో చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కా ర్యక్రమాల ప్రగతి నివేదికలపై చర్చించారు.

ప్రధానంగా మినీ ఫంక్షన్ హాళ్లు, కమ్యూనిటీ హాళ్లు, ఇండోర్ స్టేడియం, అంతర్గత మురుగునీటి కాలువలు, సీసీ రోడ్ల నిర్మాణ పను లలో వేగం పెంచాలని సూచించారు. పటాన్చెరు డివిజన్ పరిధిలో నిర్మిస్తున్న వార్డు కా ర్యాలయాన్ని ప్రత్యేకతను పూర్తి చేయాలన్నారు. ముత్తంగి డివిజన్ పరిధిలోని పాటి గ్రామ పరిధిలోగల వివేకానంద స్టేడియం అభివృద్ధికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 27 కోట్ల రూపాయలు మంజూరు చేశాయని.. పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. టెండర్లు పూర్తయిన ప నులను వెంటనే ప్రారంభించాలని.. నిర్దేశించిన గడువులోగా పనులు పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొని రావాలని సూచించారు.

పటాన్చెరు డివిజన్ పరిధిలో రెండు ఎకరాల విస్తీర్ణంలో స్లాటర్ హౌస్ (పశు వదశాల) నిర్మించబోతున్నట్లు తెలిపా రు. 10 కోట్ల రూపాయల అంచనా వ్యయం తో..ఆధునిక వసతులతో.. నూతన టెక్నాలజీతో నిర్మాణం చేయబోతున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో పటాన్చెరు డిప్యూటీ కమిషనర్ జ్యోతి రెడ్డి, పటాన్చెరు ఎమ్మార్వో హరిబాబు, రామచంద్రపురం తహసిల్దార్ సరస్వతి, విద్యుత్ శాఖ డి ఈ భాస్కరరావు, నీటిపారుదల శాఖ ఈ ఈ భీమ్, డిఈ రామస్వామి, జిహెచ్‌ఎంసి ఈఈ సురేష్, డిఈ కృష్ణవేణి, తదితరులు పాల్గొన్నారు.