15-11-2025 12:00:00 AM
కాంగ్రెస్ సీనియర్ నేత మురళీధర్‌రెడ్డి
హైదరాబాద్, నవంబర్14(విజయక్రాంతి):ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేస్తున్న అభివృద్ధికే జూబ్లీహిల్స్ ప్రజలు జేజేలు పలికారని కాంగ్రెస్ సీనియర్ నాయకులు కే మురళీధర్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ప్రజలు నవీన్ యాదవ్ కు పట్టం కట్టారన్నారు.
ప్రతిపక్షం ఎన్ని కుట్రలు, అవమానాలు, విద్వేష పూరిత ఆరోపణలు చేసినా ప్రజలు వాటిని నమ్మకుండా నవీన్ యాదవ్‌ను 24,729 ఓట్ల భారీ మెజా రిటీతో గెలిపించారని మురళీధర్‌రెడ్డి పేర్కొన్నారు. అగ్ర నేత రాహుల్ గాంధీ సారధ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఏ ఎన్నికలు వచ్చినా కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుంది అని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీని గెలిపించిన జూబ్లీహిల్స్ ప్రజలకు మురళీధర్‌రెడ్డి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.